చెమదుంపల పులుసు | Colocasia gravy Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  22nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Colocasia gravy recipe in Telugu,చెమదుంపల పులుసు, Ganeprameela
చెమదుంపల పులుసుby Ganeprameela
 • తయారీకి సమయం

  30

  గంటలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

చెమదుంపల పులుసు వంటకం

చెమదుంపల పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Colocasia gravy Recipe in Telugu )

 • చేమదుంపలు 1/4 కిలో
 • రెండు పెద్ద ఉల్లిగడ్డలు
 • 4 పచ్చిమిర్చి
 • మెంతిపొడి 1/2 టేబుల్ స్పూన్
 • జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్
 • ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్
 • చిటికెడు ఇంగువ
 • పసుపు 1/4 స్పూన్
 • చింతపండు రసం 1 కప్
 • కొత్తిమీర 1 కట్ట

చెమదుంపల పులుసు | How to make Colocasia gravy Recipe in Telugu

 1. పులుసు చేసుకోవటానికి ముందుగా చామదుంపల్ని కొద్దిగా పసుపు సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించి పొట్టు తీసి పెట్టుకోండి .
 2. పొయ్యి మీద పాన్ పెట్టి పోపుదినుసులు , ఉల్లి తరుగు ,పచ్చిమిర్చి , అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి
 3. కొద్దిగా పసుపు వేసి ఉడికించిన చామదుంపలూ వేసి కారం , మెంతి జీలకర్ర ధనియాల పొడి కొద్దిగా వేసి చింతపండు పులుసు ఒక కప్పు వేసి ఉడికించండి .
 4. పులుసు దించేముందు ఇంగువ , కొద్దిగా బెల్లం , కొత్తిమీర వేసి పొయ్యి కట్టేయండి. రుచికరమైన చామదుం పల పులుసు రెడీ. చేసుకొని ఆనందించండి .

Reviews for Colocasia gravy Recipe in Telugu (0)