స్టఫ్ఫడ్ వంకాయ బజ్జి | Stuffed Brinjal Bajji Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  22nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Stuffed Brinjal Bajji recipe in Telugu,స్టఫ్ఫడ్ వంకాయ బజ్జి, Tejaswi Yalamanchi
స్టఫ్ఫడ్ వంకాయ బజ్జిby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

స్టఫ్ఫడ్ వంకాయ బజ్జి వంటకం

స్టఫ్ఫడ్ వంకాయ బజ్జి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Stuffed Brinjal Bajji Recipe in Telugu )

 • వంకాయలు 6
 • ఉల్లిపాయ చిన్నది 1 తరిగినది
 • కొత్తిమీర తరిగినది 2 చెంచాలు
 • శనగపిండి 8 చెంచాలు
 • సోడా ఉప్పు చిటికెడు
 • ఉప్పు తగినంత
 • కారం 1/2 చెంచా
 • నూనె డీప్ ఫ్రైకి సరిపడా
 • నీరు తగినన్ని
 • నిమ్మకాయ రసం ఒక లేదా రెండు చెంచా పులుపుని బట్టి
 • వేరుశనగ పప్పు 20

స్టఫ్ఫడ్ వంకాయ బజ్జి | How to make Stuffed Brinjal Bajji Recipe in Telugu

 1. ముందుగా వంకాయలు బాగా కడిగి శుభ్రం చేసుకోండి
 2. వంకాయల మధ్యలోకి ఘాటు పెట్టుకోండి
 3. మధ్యలో కొంచెం ఉప్పు, కారం చల్లుకోండి
 4. శనగపిండిలో నీరు, ఉప్పు ,కారం ,సోడా ఉప్పు వేసి బజ్జి పిండిలా కలుపుకోండి
 5. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోండి
 6. తయారుచేసుకున్న వంకాయలను బజ్జీలు మిశ్రమంలో ముంచి తీసి కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకోండి
 7. వంకాయ బజ్జీలు తయారు
 8. స్టఫింగ్ కోసం:
 9. ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా తరగండి
 10. తరిగిన ఉల్లిపాయ కొత్తిమీర ముక్కలని ఒక గిన్నెలోకి తీసుకొని నిమ్మకాయ రసం దానిలో పిండి కలుపుకోండి
 11. ఇప్పుడు బజ్జీలకి స్టఫింగ్ తయారు
 12. బజ్జీలు వేయించగా కాగిన నూనెలో వేరుశనగలను వేయించుకోండి.
 13. వాటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి
 14. బజ్జీలలో స్టఫింగ్ పెట్టడం::::
 15. వేయించుకున్న బజ్జీలను మధ్యలోకి ఘాటు పెట్టుకోండి
 16. దానిలో ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ ని నింపండి
 17. వేయించుకున్న వేరుశనగను కూడా దానిలో పెట్టుకుంది
 18. అంతే స్టఫ్ఫడ్ వంకాయ బజ్జీ తయారు మీరు చేసుకొని ఆనందించండి

Reviews for Stuffed Brinjal Bajji Recipe in Telugu (0)