చమదుంప ఇగురు | Colocasia semi gravy Recipe in Telugu

ద్వారా Sukriti Siri  |  22nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Colocasia semi gravy recipe in Telugu,చమదుంప ఇగురు, Sukriti Siri
చమదుంప ఇగురుby Sukriti Siri
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

చమదుంప ఇగురు వంటకం

చమదుంప ఇగురు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Colocasia semi gravy Recipe in Telugu )

 • 6 : చామ దుంపలు పెద్దవి
 • 1 పెద్ద : ఉల్లిపాయ తరిగినది
 • 2 : పచ్చి మిరపకాయలు
 • నిమ్మకాయంత చింతపండు
 • 1/2 కప్పు : (టమాటా) రామ ములగ పండు గుజ్జు
 • 1 చిన్న చెంచాడు : పాసుపు
 • 2 చెంచాలు : ఎర్ర కారం
 • 1 పెద్ద చెంచాడు : ధనియాల పొడి
 • 1 చెంచాడు : జీలకర్ర మెంతుల పొడి
 • 1 చెంచాడు : గరం మసాలా పొడి
 • 1/2 చెంచాడు : బెల్లం
 • 2 పెద్ద చెంచాల : కొత్తిమీరు సన్నగా తరిగినది
 • 3 పెద్ద చెంచాల : పల్లీ నూనె
 • 1/2 చెంచాడు : ఆవాలు
 • 1/2 చెంచాడు : జీలకర్ర
 • 2 : ఎండు మిరపకాయలు ముక్కులగా తుంచినవి
 • 1 రెమ్మ : కరివేపాకు

చమదుంప ఇగురు | How to make Colocasia semi gravy Recipe in Telugu

 1. చామదుంపలను సరిపడా నీళ్లు పోసి కుక్కర్ లో 2 కూతలు వచ్చే వరకు ఉడికించి వార్చుకోండి . కాస్త చల్లారిన తర్వాత వాటి తొక్క తీసి ముక్కులుగా తరుగుకోండి .
 2. ఒక మూకుడు పెట్టి వేయించటానికి నూనె పోసి చామదుంప ముక్కలను లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోని పక్కన పెట్టుకోండి .
 3. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మూడు చెంచాల పల్లి నూనె పోసి ఆవాలు, జీలకర్ర, తుంపిన ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి.
 4. పోపు బాగా వేగిన తరువాత సన్నగా , నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు వేయించండి.
 5. ఇప్పుడు ఇందులో టమాటో (రామ మూలగా పండు) గుజ్జుని వేసి నూనె చుక్కలు తేలే వరకు మూత పెట్టి సన్నని సెగ మీద ఉడికించండి.
 6. ఇందులో ధనియాల పొడి, జిలకర మెంతుల పొడి, గరం మసాలా పొడి , ఎర్ర కారం, రుచికి అనుగుణంగా ఉప్పు, చిటికెడు చెక్కర లేదా ఒక చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలుపుకొని , తీసిపెట్టుకున్న చింతపండు రసం పోసుకోండి .
 7. మూత పెట్టి ఒక నిమిషం లేదా పచ్చిదనం పోయే వరకు మరగనివ్వండి.
 8. వేయించిపెట్టుకున్న చామదుంప ముక్కలను వేసి ఒక సారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి . అంత దెగ్గర పడి ముక్క కాస్త మెత్త బడ్డాకా తరిగిన కొత్తిమీరు వేసి గిన్నెలోకి ఓంపుకోండి.
 9. వేడి వేడి అన్నం, చామదుంప ఇగురు ,ముద్దపప్పు, నెయ్యి కలిపి భోంచేస్తే నా సామి రంగా , మీ జీవుడు అదిరిపోడు.

నా చిట్కా:

చామదుంపలు 80 శాతం వరకే ఉడికించుకోండి మరి మెత్తగా ఉడికిస్తే వేయించటానికి ఇబ్బందిగా ఉండి, నూనె కూడా ఎక్కువగా పీలుస్తాయి.

Reviews for Colocasia semi gravy Recipe in Telugu (0)