కాకరకాయ ఉల్లి కారం | Stuffed Spicy Onion Bitter Guard Recipe in Telugu

ద్వారా Suma Malini  |  23rd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Stuffed Spicy Onion Bitter Guard recipe in Telugu,కాకరకాయ ఉల్లి కారం, Suma Malini
కాకరకాయ ఉల్లి కారంby Suma Malini
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

కాకరకాయ ఉల్లి కారం వంటకం

కాకరకాయ ఉల్లి కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Stuffed Spicy Onion Bitter Guard Recipe in Telugu )

 • పొట్టి లేత కాకరకాయలు 12
 • ఉల్లిపాయలు 4 పెద్దవి
 • పండు మిర్చి 6
 • చింతపండు నిమ్మకాయంత
 • మినప్పప్పు, సెనగపప్పు చెరో చెంచా(ఐఛ్ఛికం)
 • నువ్వులు నూనె లేదా వెన్న పూస 2 చెంచాలు

కాకరకాయ ఉల్లి కారం | How to make Stuffed Spicy Onion Bitter Guard Recipe in Telugu

 1. ముందుగా కాకరకాయలును కడిగి శుభ్రం చేసుకోవాలి.
 2. మినప్పప్పు, శనగపప్పుదోరగా వేయించి ఉల్లి తరుగు, పండు మిర్చి కూడా వేయించి ముద్దగా రుబ్బుకోవాలి. చింతపండు కూడా చేర్చి మరోసారి రుబ్బుకోవాలి.
 3. ఈ ముద్దకు చెంచాడు నువ్వులనూనె లేదా వెన్న పూస, ఉప్పు కలిపి కాకరకాయలులో కూరుకోవాలి.
 4. వీటిని అరటి ఆకులో పుల్లలతో పొట్లం కట్టాలి.
 5. ఈ పొట్లం కింద మీద నిప్పులు వేసి కాని లేదా ఓవెన్ లో కానీ ఏదీ వీలు లేకపోతే దళసరి గిన్నెలో ఉప్పు పోసి కానీ కాల్చుకోవాలి.
 6. పైనవి ఏమీ వీలులేనప్పుడు కుక్కర్ లో నీళ్ళు పోసి వేరే గిన్నెలో ఈ అరటి ఆకులో కాకరకాయ లు పొట్లంపెట్టి మూతపెట్టి 2 కూతలు వచ్చే వరకు ఆవిరి పట్టి ఒక్కసారి పొడి మూకుడులో సిమ్ లో వేయించాలి.
 7. పొట్లం విప్పి వేడి వేడి నేతి అన్నం తో వడ్డించాలి.

నా చిట్కా:

ఒక్కో కాకరకాయ విడిగా పొట్లం కట్టి వండొచ్చు . పనస లేదా బాదం ఆకులను కూడా వాడొచ్చు. మామిడి, నిమ్మరసం కూడా వాడవచ్చు.

Reviews for Stuffed Spicy Onion Bitter Guard Recipe in Telugu (0)