నిమ్మకాయ తాండ్ర | Sweet Lemon Sheet Recipe in Telugu

ద్వారా Suma Malini  |  24th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sweet Lemon Sheet recipe in Telugu,నిమ్మకాయ తాండ్ర, Suma Malini
నిమ్మకాయ తాండ్రby Suma Malini
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

నిమ్మకాయ తాండ్ర వంటకం

నిమ్మకాయ తాండ్ర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet Lemon Sheet Recipe in Telugu )

 • పెద్ద నిమ్మపండ్లు 25
 • పంచదార 500గ్రా గుజ్జుకి రెట్టింపు
 • olive Oil 2 చెంచాలు

నిమ్మకాయ తాండ్ర | How to make Sweet Lemon Sheet Recipe in Telugu

 1. 15 నిమ్మకాయలనుతొక్కతో సహా తురుము కోవాలి.
 2. 10 నిమ్మకాయలు రసం లేదా లోపల తోనలు మాత్రమే తీసుకోవాలి.
 3. రెండు కలిపి పావుకిలో పంచదార కలిపి గట్టి మూత గల డబ్బాలో పెట్టి కుక్కర్ లో పెట్టిన ఉడికించాలి.
 4. ఉడికించిన పదార్ధం మెత్తగా గ్రైండ్ చేయాలి.
 5. మిగిలిన పంచదార తో కలిపి దగ్గరగా పాకం పట్టాలి.
 6. ఈ పాకాన్ని ఆలివ్ ఆయిల్ రాసిన గాజు ప్లేటులో పల్చగా పరచి ఎండ పెట్టాలి.
 7. దీనిని ఫ్రిజ్లో నిల్వ ఉంచాలి. దీనిని తేనెతో కూడా చేసుకోవచ్చు. కొంచెం గట్టి పాకం పట్టి టాఫీలు కూడా చేసుకోవచ్చు.

నా చిట్కా:

అరటి ఆకులో పరిస్తే సులువుగా వచ్చేస్తుంది. పెద్ద నిమ్మకాయలు తొక్క చేదు లేనివి బాగా ముగ్గినవి మాత్రమే వాడాలి.

Reviews for Sweet Lemon Sheet Recipe in Telugu (0)