Photo of Burfi by Sukriti Siri at BetterButter
709
0
0.0(0)
0

బర్ఫీ

Jun-24-2018
Sukriti Siri
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బర్ఫీ రెసిపీ గురించి

పట్టుమని పది నిమిషాల్లో తయారైపోయే మిఠాయి.కుంకుమ పువ్వు ఫ్లెవర్ తో ఈ బర్ఫీ ఎంతో బాగుంటుంది.సాధారణంగా బర్ఫీ చేసుకోవటానికి కోవ వాడుతారు కానీ అలా బర్ఫీ తయారీ కీ చాలా సమయం పడుతుంది. కానీ ఇక్కడ నేను పాల పొడి ని ఉపయోగించి పది నిమిషాల్లో బర్ఫీ చేసాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • దక్షిణ భారతీయ
  • ఉడికించాలి
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1/4 గ్లాస్ : మంచి నెయ్యి
  2. 3/4 గ్లాస్ : పాలు
  3. 2 1/2 గ్లాస్ : పాల పొడి
  4. 1/2 గ్లాస్ : చెక్కర
  5. చిటికెడు : కుంకుమ పువ్వు
  6. చిటికెడు : పసుపు రంగు
  7. 2 చెంచాలు : ఎండు పలుకులు

సూచనలు

  1. ఒక పళ్ళానికి లేదా కిస్తీ కి నెయ్యి రాసి ఉంచుకోండి.
  2. ఎండు పలుకులను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి.
  3. కుంకుమ పువ్వు, పాలు మరియు పసుపు రంగు బాగా కలిపి ఒక నిమిషం వేడి చేసుకోండి.
  4. ఒక మందపాటి మూకుడులో నెయ్యి వేసి కరిగిన తర్వాత పాల పొడి ,చెక్కర కుంకుమ పువ్వు పసుపు రంగు మరియు పాల మిశ్రమం అన్ని వేసుకొని బాగా కలుపుకోండి.
  5. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ దెగ్గర పడే వరకు ఉడికించండి.
  6. ముద్దలా మారటానికి దాదాపు 8 నుండి 10 నిమిషాలు పడుతుంది.
  7. దెగ్గర పడి ముద్దలా మారిన తర్వాత నెయ్యి రాసి పెట్టుకున్న పళ్లెం లోకి తీసుకొని సమానంగా పరుచుకోండి.
  8. తరిగి పెట్టుకున్న ఎండు పలుకులు వేసి చెంచా తో వత్తు కోండి.
  9. అరగంట పాటు ఫ్రిడ్జి లో చల్లార బెట్టుకోండి.
  10. గట్టి పడిన తరువాత నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకొని తినేయండి.
  11. పదినిమిషాల్లో బర్ఫీ తయార్.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర