కాజు కర్రీ | Kaju curry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  25th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Kaju curry by Tejaswi Yalamanchi at BetterButter
కాజు కర్రీby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

కాజు కర్రీ వంటకం

కాజు కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kaju curry Recipe in Telugu )

  • టమోటాలు 4
  • ఉల్లిపాయలు 3
  • తరిగిన కొత్తిమీర రెండు చెంచాలు
  • జీడిపప్పు 25
  • జీడిపప్పు పేస్ట్ నాలుగు చెంచాలు
  • గరంమసాలా 1/4 చెంచా
  • పసుపు 1/4 చెంచా
  • ఉప్పు సరిపడా
  • కారం 3 చెంచాలు
  • ధనియాలపొడి 1/2 చెంచా
  • నూనె 6 చెంచాలు

కాజు కర్రీ | How to make Kaju curry Recipe in Telugu

  1. ముందుగా టమోటాలు ఉల్లిపాయలు శుభ్రంగా కడుక్కోండి
  2. టమోటాలు విడిగా పేస్ట్లా చేసుకోండి
  3. ఉల్లిపాయలు విడిగా పేస్ట్లా చేసుకోండి
  4. పొయ్యిమీద పక్కనే ఇంకొక పాన్ పెట్టుకొని రెండు చెంచాల నూనె వేసుకొని దాంట్లో జీడిపప్పుని చక్కగా వేయించుకోండి.పక్కన పెట్టుకోండి.
  5. ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు తీసుకోండి
  6. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి దానిలో నూనె వేసి కగానీవండి
  7. అది కాగాక ఉల్లిపాయ పేస్ట్ వేసి వాసన పోయే దాక వేయించాలి
  8. దాంట్లో ఉప్పు కారం పసుపు ధనియాలపొడి గరంమసాలా వేసి బాగా కలపండి
  9. ఇప్పుడు టమాటా పేస్ట్ ని వేసుకోండి.ఒక 10 నిమిషాలు ఉడకనివండి
  10. జీడిపప్పు పేస్ట్ని దాంట్లో వేయండి
  11. అరగ్లాసు నీరు పోసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి
  12. వేయించిన జీడిపప్పులు వేసి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి
  13. అంతే కాజు కర్రీ తయారు

Reviews for Kaju curry Recipe in Telugu (0)