టొమాటో పచ్చడి | Tomato instant pickle Recipe in Telugu

ద్వారా Subhamahi Nucherla  |  26th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tomato instant pickle recipe in Telugu,టొమాటో పచ్చడి, Subhamahi Nucherla
టొమాటో పచ్చడిby Subhamahi Nucherla
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

1

0

టొమాటో పచ్చడి వంటకం

టొమాటో పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato instant pickle Recipe in Telugu )

 • టొమాటోలు - 1/2 కిలో
 • ఉప్పు. - 4 లేదా 5 స్పూన్లు
 • కారం. - 4 లేదా 5 స్పూన్లు
 • చింత పండు. - ఒక చిన్న నిమ్మకాయ అంత
 • బెల్లం - ఒక చిన్న ముద్ద
 • ఆవపిండి. - 2 లేదా 3 స్పూన్స్
 • మెంతి పిండి - 1/2 స్పూన్
 • నూనె 100 ml
 • ఇంగువ. 3 చిటికెళ్లు
 • అవలు 3 స్పూన్స్
 • ఎండుమిర్చి 2
 • కరివేపాకు

టొమాటో పచ్చడి | How to make Tomato instant pickle Recipe in Telugu

 1. ముందుగా ఒక అరకేజి టొమాటో లను తీసుకొని కడిగి ,తుడిచి ఆరబెట్టాలి.
 2. తయారు అవుతున్న పచ్చడి
 3. తయారు అయ్యాక జాడీలో నిలువ ఉంచిన పచ్చడి
 4. ఆరిన టొమాటో లను ముక్కలుగా చేసుకొని మిక్సీ లో జూస్ లా తయారు చేసుకోవాలి. I
 5. ఇలా జ్యూస్ చేసేటప్పుడే ఈనెలు, గింజలు లేకుండా శుభ్ర పరచుకున్న చింత పండును కూడా వేసు కోవాలి
 6. చిరు తిండికి చిరు ప్రయత్నం. కొబ్బరి మిఠాయి, మరియు నిప్పట్లు.
 7. అదే బాణలిలో సగం నూనె వేసి మనం చేసి పెట్టుకున్న టొమాటో జ్యూస్ నీ వేసి చిన్న సెగపై ఉడికించాలి.
 8. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
 9. అలా ఆ జ్యూస్ దగ్గర పడుతోంది అన్నప్పుడు ఒక చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
 10. పచ్చడి ఇంక కొంచం దగ్గరకు వచ్చినప్పుడు బెల్లం వేసుకొని కలుపుకోవాలి.
 11. పచ్చడి బాగా ముద్దగా వచ్చినప్పుడు తగినంత కారం వేసి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
 12. ఇప్పుడు ఆవపిండి, మెంతి పిండి వేసి కలిపి స్టౌ ఆపేయాలి.
 13. చివర్లో మిగిలిన నూనె లో ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి తో తురగవాత వేసుకొని కలుపు కోవాలి.
 14. ఇది అన్నం లోకి, దోశ లలోకి, చపాతీ, పూరీ అన్నిటికీ బాగుంటుంది.
 15. చల్లారాక తడి లేని డబ్బా లోకాని ,జాడి లో కానీ ఎత్తిపెట్టాలి.

నా చిట్కా:

ఈ పచ్చడి ప్రయాణాల్లో చాలా బాగుంటుంది,తొందరగా పాడవ్వదు, ఒక వారం ఉంటుంది.దేనికయినా మంచి కాంబినేషన్.

Reviews for Tomato instant pickle Recipe in Telugu (0)