హోమ్ / వంటకాలు / టమాట రైస్

Photo of Tomato rice by Ganeprameela  at BetterButter
510
1
0.0(0)
0

టమాట రైస్

Jun-27-2018
Ganeprameela
25 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాట రైస్ రెసిపీ గురించి

టమాట ఆరోగ్యానికి చాల మంచిది పిల్లలకి ఈ విధంగా టమాట రైస్ అప్పుడప్పుడు చేసి పెడితే ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బాసుమతి రైస్ 1కప్
  2. టమాటలు 1/4 కేజి
  3. నెయ్యి 2 టేబుల్ స్పూన్స్
  4. జీడి పప్పు 7-8
  5. లవంగాలు 3-4
  6. ఇలాచీలు 2
  7. చిన్న ముక్క దాల్చిన చెక్క
  8. జాజికాయ చిన్న ముక్క
  9. షాజీర 1/2 స్పూన్
  10. బిర్యానీ ఆకు
  11. పచ్చిమిర్చి 4-5
  12. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1స్పూన్
  13. కొత్తిమీర పుదీన 1/2 కప్
  14. ఉప్పు తగినంత
  15. ఉల్లిగడ్డ 1

సూచనలు

  1. ముందుగా బాసుమతి రైస్ ఒక్క సారి కడిగి నీళ్ళు పోసి పెట్టుకోవాలి
  2. స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక
  3. జీడిపప్పు వేపి పక్కన పెట్టుకోవాలి
  4. అదే పాన్ లో ఇంకొద్దిగ నెయ్యి వేసి మసాల ఐటమ్స్ బిర్యానీ ఆకు వేసి వేగనివ్వాలి
  5. ఉల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర పుదీన తరిగి వేసుకోవాలి
  6. తరువాత అల్లం వేల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి
  7. టమాటలు జ్యూస్ లాగ గ్రైండ్ చేసి 1 కప్ జ్యూస్ 1 కప్ నీళ్ళు వేసి ఉప్పు వేసీ మరిగించాలి
  8. మరుగుతున్న పోపు లో నాన పెట్టిన బాసుమతి రైస్ వేసి ఉడికించాలి
  9. చివరిగా నెయ్యిలో వేపిన జీడిపప్పు రైస్ లో వేసి సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర