ములక్కాడ ఆవకూర | Drumsticks curry Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  28th Jun 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Drumsticks curry recipe in Telugu,ములక్కాడ ఆవకూర, Sri Tallapragada Sri Devi
ములక్కాడ ఆవకూరby Sri Tallapragada Sri Devi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

1

ములక్కాడ ఆవకూర వంటకం

ములక్కాడ ఆవకూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Drumsticks curry Recipe in Telugu )

 • ములక్కాడలు నాలుగు
 • కరివేపాకు రెండు రెబ్బలు
 • ఆవాలు రెండు చెంచాలు
 • నూపప్పు 4 చెంచాలు
 • చిన్న కొబ్బరి ముక్క
 • రెండు చెంచాల బియ్యం నానబెట్టాలి
 • ఒక మూడు ఎండుమిరపకాయలు
 • ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకోవాలి
 • ఉప్పు రుచికి సరిపడా
 • చిటికెడు పసుపు
 • పోపుకోసం ఒక చెంచాడు నూనె
 • మినప్పప్పు
 • సెనగపప్పు
 • ఆవాలు
 • ఇంగువ

ములక్కాడ ఆవకూర | How to make Drumsticks curry Recipe in Telugu

 1. మొదట చిన్న ముక్కలుగా తరిగిన ములక్కాడలు ఉప్పు పసుపు వేసి చింతపండు నీటిలో ఉడికించాలి
 2. గ్రైండర్లో నువ్వు పప్పు బియ్యం కొబ్బరి ఎండుమిరపకాయలు ఆవాలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి
 3. ములక్కాడలు ఉడికాక ఆ ఆ చింతపండు రసం నీటిలోనే ఈ రుబ్బిన ముద్ద వేసి దగ్గరగా అయ్యేదాకా ఉడికించాలి కూర గరిటజారుగా ఉండాలి మరీ గట్టిగా ఐతే కొంచెం నీరు పోసుకోవచ్చు
 4. మూకుట్లో ఒక చెంచా నూనె వేసి మినప్పప్పుశనగపప్పు ఆవాలు చిదిమిన ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు రెబ్బలు వేసి పోపు వేయించాలి
 5. వేయించిన పోపు కి ఉడికిన కూరలో వేసి కలపాలి ఈ కూర అన్నంలోకి చపాతీల్లోకి రుచిగా ఉంటుంది

నా చిట్కా:

చింతపండు ఉప్పు వారి ఇంటి అలవాటును బట్టి వేసుకోవాలి. ఆవాలు కొబ్బరి నువ్వులు చాలా మెత్తగా రుబ్బుకోవాలి

Reviews for Drumsticks curry Recipe in Telugu (1)

Suma Malini10 months ago

జవాబు వ్రాయండి