మామిడి పండ్ల శ్రీ ఖండ | Mango sri khand Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  28th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Mango sri khand by Indira Bhaskar at BetterButter
మామిడి పండ్ల శ్రీ ఖండby Indira Bhaskar
 • తయారీకి సమయం

  2

  గంటలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

15

0

మామిడి పండ్ల శ్రీ ఖండ

మామిడి పండ్ల శ్రీ ఖండ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango sri khand Recipe in Telugu )

 • చిక్కని గడ్డ పెరుగు 1కప్పు
 • మామిడి పండు గుజ్జు 1 కప్పు
 • చక్కెర లేదా తేనె 1 టేబుల్ స్పూన్
 • యాలకుల లేదా దాల్చిన చెక్క పొడి 1/4స్పూన్
 • బాదం , పిస్తా పప్పు పొడి 1 టేబుల్ స్పూన్

మామిడి పండ్ల శ్రీ ఖండ | How to make Mango sri khand Recipe in Telugu

 1. ముందుగా పెరుగుని ఒక శుభ్రమైన బుట్టలో వేసి నీరు అంతా పోయే వరకు గట్టిగా మూట కట్టుకుని 2 గంటలు ఉంచాలి.
 2. చక్కెరను పొడి చేసి పెట్టుకోవాలి
 3. ఇప్పుడు ఒక గిన్నెలో గడ్డ పెరుగు, మామిడి పండు గుజ్జు, చక్కెర పొడి , యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
 4. దీనిని ఒక కప్పు లో పైన వేసి బాదం , పిస్తా పప్పుల పొడితో అలంకరించి సర్వ్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన మామిడి పండు శ్రీ ఖండం రేడీ.

నా చిట్కా:

దీనిని 1 గంట ఫ్రిజ్ లో ఉంచి తింటే మరింత రుచిగా ఉంటుంది.

Reviews for Mango sri khand Recipe in Telugu (0)