వాము అన్నము | Ajwan rice Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  28th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ajwan rice recipe in Telugu,వాము అన్నము, Indira Bhaskar
వాము అన్నముby Indira Bhaskar
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  1

  జనం

1

0

వాము అన్నము వంటకం

వాము అన్నము తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ajwan rice Recipe in Telugu )

 • వండిన అన్నం 1 కప్పు
 • నెయ్యి /నూనె 1 స్పూను
 • వాము 1/2 చెంచా
 • ఆవాలు 1/4 చెంచా
 • జీలకర్ర 1/4 చెంచా
 • మినప్పప్పు 1/4 చెంచా
 • శెనగపప్పు 1/4 చెంచా
 • పచ్చిమిర్చి చిన్నది 1
 • కరివేపాకు 1 రెమ్మ
 • పసుపు 1/4 చెంచా
 • ఉప్పు 1/4 చెంచా

వాము అన్నము | How to make Ajwan rice Recipe in Telugu

 1. ముందుగా అన్నం 1 కప్పుడు వండి ఉంచుకోవాలి.
 2. మూకుడులో నెయ్యి వేసి ఆవాలు , వాము, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు, వేసి వేగనివ్వాలి.
 3. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు వేసుకోవాలి.
 4. అన్నీ వేగాక అన్నం , ఉప్పు వేసి బాగా కలపాలి.
 5. దీనిని పెరుగు లేదా పెరుగు రైతా తో తింటే చాలా రుచిగా ఉంటుంది.

నా చిట్కా:

దీనిని చిన్న పిల్లలకి వారానికి ఒకసారి చొప్పున పెడితే వాళ్ళకి ఆకలి బాగా పుడుతుంది.

Reviews for Ajwan rice Recipe in Telugu (0)