ఉప్పు పొంగల్ | Hot pongal Recipe in Telugu

ద్వారా Subhamahi Nucherla  |  29th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Hot pongal recipe in Telugu,ఉప్పు పొంగల్, Subhamahi Nucherla
ఉప్పు పొంగల్by Subhamahi Nucherla
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

ఉప్పు పొంగల్ వంటకం

ఉప్పు పొంగల్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Hot pongal Recipe in Telugu )

 • పెసరపప్పు - 1 గ్లాస్
 • బియ్యం - 1.5 గ్లాస్
 • మిరియాలు - 1 స్పూన్
 • అవలు. - 1/2 స్పూన్
 • జీలకర్ర. -1/2 స్పూన్
 • మినపప్పు. - 1/2 స్పూన్
 • శెనగ పప్పు. - 1/2 స్పూన్
 • జీడి పప్పు - 10
 • పచ్చి మిర్చి -4 లేదా 5
 • కరివేపాకు -
 • కొత్తిమీర
 • అల్లం తురుము - 1/2 స్పూన్
 • నెయ్యి - 5 లేదా 6 స్పూన్స్
 • ఉప్పు తగినంత
 • పసుపు చిటికెడు
 • ఇంగువ చిటికెడు
 • ఎండుమిర్చి. - 2

ఉప్పు పొంగల్ | How to make Hot pongal Recipe in Telugu

 1. మొదట ఒక గిన్నెలో లేదా కుక్కర్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి పెసరపప్పు వేయించు కోవాలి.
 2. పెసర పప్పు వేగగానే బియ్యం వేసి వెచ్చ చేసుకోవాలి
 3. తరువాత పై వాటిని కడిగి ఒక గ్లాస్ బియ్యం మిశ్రమానికి 3 గ్లాసుల నీళ్ళు పోసి ఉడికించాలి.కుక్కర్ అయితే 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టచ్చు.మెత్తగా ఉడికించుుకోవాలి.
 4. అది ఉడికాక పక్కన పెట్టీ ఒక బాణలి లో మిగిలిన నెయ్యి వేసి వేడి చేయాలి.
 5. అలా వేడి అయిన నెయ్యి లోకి అవాలు, జీలకర్ర, మినపప్పు, శెనగ పప్పు వరుసగా వేస్తూ వేపుకోవాలి
 6. తరువాత జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి
 7. ఇవన్నీ వేగాక మిరియాల పొడిని వేసి వేయించాలి
 8. తరువాత పచ్చి మిర్చి, అల్లం తురుము కరివేపాకు వేసి వేయించుకోవాలి
 9. అలా వేగిన మిశ్రమానికి ఒక చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి
 10. తరువాత ఇంగువ వేయాలి
 11. ఎండుమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి
 12. ఇలా అన్నీ వేయించి పెట్టుకున్న దానిలోకి ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి
 13. చివర్లో కొత్తిమీర చల్లి ,అవసరం అనుకుంటే ఇంకొంచం నెయ్యి వేసి కలుపకోవాలి
 14. వేడి వేడిగా పొంగాల్ తింటే చాలా బాగుంటుంది.
 15. ఇందులో నెయ్యి బదులుగా వెన్న కూడా వేసుకోవచ్చు.
 16. ఇలా తయారు అయిన పోంగాల్ ను పల్లి పచ్చడి ,కొబ్బరి పచ్చడి, పచ్చి పులుసు ,మిడుసు లేదా రైతా లాంటి వాటితో తింటే అద్భుతంగా ఉంటుంది
 17. తయారు అయిన వేడి వేడి పాంగల్
 18. పచ్చి పులుసు తో తినడానికి సిద్దంగా ఉన్న పొంగల్.

నా చిట్కా:

అన్నీ ఒకేసారి తిరగవాత వేసుకొని కూడా అందులో పెసరపప్పు ,బియ్యం కలిపి కూడా ఉడికించి పొంగలు చేసుకోవచ్చు.

Reviews for Hot pongal Recipe in Telugu (0)