హోమ్ / వంటకాలు / ఖర్జూరం నిల్వ పచ్చడి

Photo of Dates pickle by Indira Bhaskar at BetterButter
0
0
0(0)
0

ఖర్జూరం నిల్వ పచ్చడి

Jun-29-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖర్జూరం నిల్వ పచ్చడి రెసిపీ గురించి

తినడానికి రుచిగా ఆరోగ్యం పరంగా పోషకాలను ఇచ్చే చిక్కని వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. గింజలు తీసేసిన ఖర్జూరం పండ్లు 15
  2. చింతపండు గుజ్జు 3 టేబుల్ స్పూన్లు
  3. కారం 1 1/2 టేబుల్ స్పూన్
  4. ఉప్పు 1/2 టేబుల్ స్పూన్
  5. గానుగ నూనె 2 స్పూన్లు
  6. వేయించిన ఆవాలు , మెంతుల పొడి 1/4 స్పూన్
  7. ఆవాలు కొద్దిగా
  8. మెంతులు కొద్దిగా

సూచనలు

  1. ఖర్జూరం పండ్ల నుండి గింజలు తీసి వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగాక అందులో ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడనివ్వాలి.
  3. తర్వాత అందులో కట్ చేసుకున్న ఖర్జూరాన్ని వేయాలి.
  4. ఖర్జూరం కొద్దిసేపు బాగా వేగిన తర్వాత తీసి వేరొక పళ్ళెంలో పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు మరికొంచెం నూనె వేసి అందులో చింతపండు గుజ్జు వేసి బాగా మగ్గనివ్వాలి.
  6. ఇప్పుడు అందులో ఉప్పు కారం వేసి మగ్గనివ్వాలి.
  7. ఇప్పుడు ఇందులో వేయించుకున్న ఖర్జూరం కూడా వెయ్యాలి.
  8. ఇప్పుడు ఇందులో ఆవాలు మెంతిపొడి వేసి బాగా కలపాలి.
  9. పైకి నూనె అంత వచ్చేవరకు ఉంచాలి.
  10. అంతే ఎంతో రుచికరమైన ఖర్జూరం పచ్చడి రెడీ.
  11. దీనిని వేడివేడి అన్నం ,ఇడ్లీ ,దోస ,చపాతి పూరి దేనితో కలిపి తిన్న చాలా అద్భుతంగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర