ఎర్రగుమ్మడికాయ తీపి కూర | Red Pumpkin sweet curry Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  29th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Red Pumpkin sweet curry recipe in Telugu,ఎర్రగుమ్మడికాయ తీపి కూర, Indira Bhaskar
ఎర్రగుమ్మడికాయ తీపి కూరby Indira Bhaskar
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

ఎర్రగుమ్మడికాయ తీపి కూర వంటకం

ఎర్రగుమ్మడికాయ తీపి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red Pumpkin sweet curry Recipe in Telugu )

 • ఎర్ర గుమ్మడి కాయ ముక్కలు 1 కప్పు
 • చింతపండు గుజ్జు 1 పెద్ద చెంచాడు
 • ఉప్పు 1/2 చెంచా
 • బెల్లం తురుము / పంచదార 2 చెంచాలు
 • నెయ్యి/నూనె 1చెంచా
 • ఆవాలు 1/4 చెంచా
 • జీలకర్ర 1/4 చెంచా
 • మినప్పప్పు 1/4 చెంచా
 • శెనగపప్పు 1/4 చెంచా
 • ఎండు మిరపకాయలు 1
 • కరివేపాకు 1 రెమ్మ

ఎర్రగుమ్మడికాయ తీపి కూర | How to make Red Pumpkin sweet curry Recipe in Telugu

 1. ముందుగా గుమ్మడికాయనూ చిన్న ముక్కలుగా తరుక్కుని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టాలి.
 2. ఇప్పుడు ఒక మూకుట్లో నూనె వేసి నూనె కాగాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు ఎండుమిరపకాయ వేసి తాలింపు పెట్టాలి.
 3. ఇప్పుడు ఉడికిన గుమ్మడికాయ ముక్కల్ని స్మాష్ చేసి ముద్దలా చేయాలి
 4. తరవాత అందులో గుమ్మడికాయ ఉడికిన ముద్ద ,ఉప్పు ,బెల్లం వేసి చిన్న మంట మీద బె ల్లం పాకం వచ్చేవరకు మగ్గనివ్వాలి.
 5. కూరంత దగ్గరపడేవరకు గట్టిపడేవరకు ఉంచాలి.
 6. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి అన్నంలో నెయ్యి తో వేసుకు తినే ఎంతో రుచిగా ఉండే ఎర్రగుమ్మడికాయ కూర రెడీ.

నా చిట్కా:

ఇది చిన్న పిల్లలకు బలం మరియు వారికి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.

Reviews for Red Pumpkin sweet curry Recipe in Telugu (0)