హోమ్ / వంటకాలు / ఉగ్గాని

Photo of Uggani by Sree Sadhu at BetterButter
332
1
0.0(0)
0

ఉగ్గాని

Jun-30-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉగ్గాని రెసిపీ గురించి

ఉగ్గాని పేరు తెలియని రాయలసీమ వాసులు ఉండరేమో.. రాయలసీమలో అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకం ఇది. వారికి ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉగ్గాని తప్పనిసరిగా ఉండాల్సిందే. మరి బొరుగులు/మరమరాలతో చేసే ఈ వెరైటీ బ్రేక్‌ఫాస్ట్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. మరమరాలు : అరకేజీ
  2. ఆవాలు 1 టేబుల్ స్పూన్
  3. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  4. మినప్పప్పు 1 టేబుల్ స్పూన్
  5. శెనగపప్పు 1 టేబుల్ స్పూన్
  6. పల్లీలు : 1 టేబుల్ స్పూన్
  7. పచ్చిమిర్చి : 6-8 (కారానికి సరిపడా)
  8. ఉల్లిపాయ : ఒకటి
  9. టమాటా : ఒకటి
  10. కరివేపా : రెండు రెమ్మలు
  11. కొత్తిమీర : గుప్పెడు
  12. పసుపు : ఒక టీ స్పూన్
  13. నూనె : 4 టేబుల్ స్పూన్లు
  14. ఉప్పు : తగినంత
  15. పుట్నాలు (ఫ్రైడ్ బెంగాల్ గ్రామ్) : అర కప్పు
  16. ఎండుకొబ్బరి : కొద్దిగా
  17. వెల్లుల్లి రెబ్బలు - 6-8

సూచనలు

  1. ముందుగా ఓ పెద్ద గిన్నెలో సగానికి పైగా నీరు పోసి అందులో మరమరాలు వేసి ఓ 5 నిమిషాలు నానబెట్టుకోవాలి.
  2. ఈలోపుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుకొబ్బరి, వెల్లుల్లి, పుట్నాలు వేసుకొని కచ్చపచ్చాగా పొడి చేసుకోవాలి.
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి, మూకుడు పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి.
  4. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు, వేరుశెనగ పప్పు వేసి దోరగా వేయించుకోవాలి.
  5. అదే నూనెలో రెండుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేగనివ్వాలి.
  6. ఆ తర్వాత చివరిగా ఉందులో ఉప్పు కూడా చేర్చాలి.
  7. ఈ మిశ్రమం అంతా దోరగా వేగిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న బొరుగులను గట్టిగా నీరు లేకుండా పిండి, బాణలిలో వేయాలి.
  8. బొరుగులకు పోపు పట్టేలా బాగా కలుపుకోవాలి.
  9. ఆ తర్వాత చివరిగా ఈ మిశ్రమానికి మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని జోడించాలి.
  10. చివరిగా కొత్తిమీరను చేర్చుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడే బొరుగులు ఉప్మా (ఉగ్గాని) రెడీ..!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర