బీరకాయ పప్పు | Ridge guard dal Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ridge guard dal recipe in Telugu,బీరకాయ పప్పు, Sri Tallapragada Sri Devi
బీరకాయ పప్పుby Sri Tallapragada Sri Devi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

బీరకాయ పప్పు వంటకం

బీరకాయ పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridge guard dal Recipe in Telugu )

 • బీరకాయలు చెక్కు తీసి ముక్కలు చేసి రెండు
 • పచ్చిమిరపకాయలు 3
 • పెసరపప్పు ఒక కప్పు
 • ఒక గ్లాసుడు నీళ్లు
 • మినప్పప్పు
 • ఆవాలు
 • జీలకర్ర
 • ఇంగువ
 • కరివేపాకు
 • ఎండుమిరపకాయలు
 • రెండు చెంచాల నూనె లేదా నెయ్యి

బీరకాయ పప్పు | How to make Ridge guard dal Recipe in Telugu

 1. బీరకాయ ముక్కలు పెసరపప్పు ఒక గ్లాసు నీరు పోసి ఉడికించుకోవాలి
 2. పప్పు బీరకాయ ముక్కలు ఉడికాక ఉప్పు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అన్నిటినీ బాగా ఉడకనివ్వాలి
 3. మూకుడులో రెండు చెంచాల నూనె వేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ముక్కలుగా చేసిన ఎండుమిరపకాయలు కరివేపాకు పోపు వేయించాలి
 4. వేయించిన పోపు ఉడికిన పప్పు కలపాలి ఈ బీరకాయ పప్పు అన్నం చపాతీల్లోకి బావుంటుంది
 5. నచ్చినవారు ఇంగువ బదులు వెల్లుల్లి గరంమసాలా వేసుకోవచ్చు

నా చిట్కా:

పప్పు పోపులో నూనె బదులు నెయ్యి మరింత రుచికరంగా ఉంటుంది. ఒకసారి ఇంగువ మరొకసారి వెల్లుల్లి తో పోపు ట్రై చేయొచ్చు

Reviews for Ridge guard dal Recipe in Telugu (0)