బొబ్బర్లు మసాలా | Cow beans masala Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cow beans masala recipe in Telugu,బొబ్బర్లు మసాలా, Sree Vaishnavi
బొబ్బర్లు మసాలాby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  8

  గంటలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

బొబ్బర్లు మసాలా వంటకం

బొబ్బర్లు మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cow beans masala Recipe in Telugu )

 • బొబ్బర్లు 1 కప్పు
 • ఉల్లిపాయముక్కలు 1 కప్పు
 • టొమేటో ముక్కలు 2 కప్పులు
 • ఉప్పు తగినంత
 • పసుపు 1 చెంచా
 • కారం 1 చెంచా
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా
 • గరం మసాలా 1 చెంచా
 • ఇలాచీ 1
 • లవంగము 2
 • దాల్చిన చెక్క చిన్నది 1
 • బిరియాని ఆకు 1
 • చెక్కర 1 చెంచా
 • నూనె 1 చెంచా

బొబ్బర్లు మసాలా | How to make Cow beans masala Recipe in Telugu

 1. ముందురోజు బొబ్బర్లను నీటిలో నానపెట్టుకోవాలి .
 2. మరుసటిరోజు కుక్కర్ లో బొబ్బర్లు , దాల్చిన చెక్క , ఇలాచీ , లవంగము , బిరియాని ఆకు కొంచెం ఉప్పు మరియు 2 కప్పుల నీరు పోసి స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి .
 3. ఇప్పుడు దానిని చల్లారనివ్వాలి
 4. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో నూనె వేసుకొని వేడి అయ్యాక
 5. ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి . తరువాత అల్లం వెల్లుల్లి వేసి వేగాక .
 6. ఉప్పు , కారం, గరం మసాలా , పసుపు వేసి వేయించాలి
 7. ఇప్పుడు టమోటా ముక్కలు వేసి బాగా మగ్గాక ఉడికించుకున్న బొబ్బర్లు వేసి 2 నిముషాలు ఉడికించాలి .
 8. అంతే రుచికరమైన బొబ్బర్ల కూర రెడీ

Reviews for Cow beans masala Recipe in Telugu (0)