బేబి కార్న్ 65 | Baby corn 65 Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Baby corn 65 by Indira Bhaskar at BetterButter
బేబి కార్న్ 65by Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

బేబి కార్న్ 65 వంటకం

బేబి కార్న్ 65 తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Baby corn 65 Recipe in Telugu )

  • బేబీకార్న్ 100 గ్రాములు
  • నూనె-వేయించడానికి సరిపడా
  • మైదా రెండు చెంచాలు
  • కార్నఫ్లోర్ 2 చెంచాలు
  • ఉప్పు అర టేబుల్ స్పూను
  • కారం అర టేబుల్ స్పూను
  • మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టేబుల్ స్పూను

బేబి కార్న్ 65 | How to make Baby corn 65 Recipe in Telugu

  1. ముందుగా బేబీకార్న్ చిన్న ముక్కలుగా మధ్యలో కట్ చేసి వేడినీటిలో వేసి ఐదు నిముషాలు ఉడక పెట్టాలి కొద్దిగా ఉప్పు వేసి ఉడకపెట్టాలి.
  2. అప్పుడు వాటిని నీటినుండి వడకట్టి పక్కన పెట్టాలి.
  3. ఇప్పుడు ఒక గిన్నెలోకి మైదాపిండి, కార్న్ఫ్లోర్ ,అల్లంవెల్లులి ముద్ద, కారం, ఉప్పు ,మిరియాల పొడి కొద్దిగా నీరు వేసి గరిటెజారుగా తయారు చేయాలి.
  4. ఇలా తయారుచేసిన దాంట్లో ఉడకపెట్టిన బేబీకార్న్ ముక్కలు వేసి బాగా కలపాలి.
  5. ఇప్పుడు ఒక మూకుట్లో నూనె వేసి బాగా కాచాలి.
  6. నూనె కాగాక బేబీకార్న్ ముక్కల్ని వేసి చిన్న మంట మీద ఎర్రగా వచ్చేవరకు వేయించాలి. అంతే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బేబీ కార్న్ 65 టమాటా కెచప్తో తినడానికి రెడీ.

నా చిట్కా:

దీంట్లో కావాలంటే కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి కూడా కలుపుకోవచ్చు.

Reviews for Baby corn 65 Recipe in Telugu (0)