హోమ్ / వంటకాలు / పన్నీర్ కోఫ్తా కర్రీ

Photo of Paneer kofta curry by Indira Bhaskar at BetterButter
923
0
0.0(0)
1

పన్నీర్ కోఫ్తా కర్రీ

Jul-01-2018
Indira Bhaskar
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ కోఫ్తా కర్రీ రెసిపీ గురించి

దీనిని జీరా రైస్ ,బిర్యాని ,టమాటా రైస్ వాటిల్లో సైడిష్గా తీసుకుంటే బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఉత్తర భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళదుంప పెద్దది ఒకటి
  2. పనీర్ 100 గ్రాములు
  3. గరం మసాలా పౌడర్ ఒక స్పూన్
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా
  5. జీడిపప్పు కిస్మిస్ బాదం ముక్కలు రెండు స్పూన్లు
  6. ఉప్పు ఒక చెంచా
  7. కారం పావు చెంచా
  8. కర్న్ ఫ్లోర్ 4 చెంచాలు
  9. నూనె డీప్ ఫ్రైకి సరిపడా
  10. గ్రేవీ కావల్సినవి
  11. ఉల్లిపాయలు రెండు
  12. టమాటాలు నాలుగు
  13. కారం ఒక స్పూన్
  14. బిర్యాని ఆకు 1
  15. లవంగాలు అయిదు
  16. దాల్చిన చెక్క చిన్న ముక్క
  17. ఇలాచి 1
  18. ధనియాల పొడి ఒక చెంచా
  19. జీలకర్ర పొడి ఒక స్పూను
  20. జీడిపప్పు పేస్టు రెండు చెంచాలు
  21. కసూరి మేథీ కొద్దిగా
  22. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా పనీర్ను తురుముకోవాలి.
  2. ఇప్పుడు బంగాళదుంపలు ఉడకపెట్టి ముద్దలా చేయాలి.
  3. ఇప్పుడు పన్నీరు తురుముకున్న బంగాళదుంపలు ఒక బౌల్లో తీసుకొని దానిలో గరంమసాలా పొడి, కొద్దిగా ఉప్పు కారం ముందుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదాం కిస్మిస్ పలుకులు అన్ని కలిపి చేసుకోవాలి.
  4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టాలి.
  5. ఇప్పుడు వీటిని కార్నఫ్లోర్ పొడిలో దొర్లించి పక్కన పెట్టాలి.
  6. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి బాగా మరిగించాలి.
  7. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీరు బంగాళదుంపల ఉండాలని నూనెలో చిన్నమంటమీద ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి.
  8. ఇప్పుడు గ్రేవి సిద్ధం చేసుకోవాలి.
  9. గ్రేవీ కోసం ముందుగా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. టమాటాలను జ్యూస్ లా చేసి పక్కన పెట్టాలి.
  10. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి కాగాక బిర్యాని ఆకు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క వేసి వేగనివ్వాలి.
  11. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి వేగాక టమాటా జ్యూస్ వెయ్యాలి.
  12. ఇవి అన్ని బాగా ఉడికి మగ్గాక అందులో ధనియా పౌడర్ ,జీలకర్ర పొడి ,కారం , ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి.
  13. ఇప్పుడు ఇందులో జీడిపప్పు పేస్ట్ కూడా వేసి మగ్గనివ్వాలి.
  14. ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు కసూరి మేథీ ఆకుల్ని బాగా మెదిపి వేయాలి.
  15. ఇవి అన్ని బాగా మగ్గి దగ్గరపడ్డాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ బంగాళదుంప బాల్స్ ను ఈ గ్రేవీలో వెయ్యాలి
  16. గ్రేవీలో వేశాక ఒక నిమిషం ఉంచి బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో అలంకరించి కుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర