హోమ్ / వంటకాలు / క్రిస్పీ చిల్లీ బేబీకార్న్

Photo of Crispy Chilli baby corn by Indira Bhaskar at BetterButter
924
0
0.0(0)
0

క్రిస్పీ చిల్లీ బేబీకార్న్

Jul-01-2018
Indira Bhaskar
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్రిస్పీ చిల్లీ బేబీకార్న్ రెసిపీ గురించి

ఇది పెద్దలు పిల్లలు అందరూ ఇష్టపడే చైనీస్ వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చైనీస్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. బేబి కార్న్ 100 గ్రాములు
  2. మైదాపిండి రెండు స్పూన్లు
  3. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
  5. కారం అర స్పూను
  6. ఉప్పు పావు స్పూను
  7. మిరియాలపొడి కొద్దిగా
  8. ఏ డీప్ఫ్రైకి సరిపడా
  9. గ్రేవీ కావాల్సిన పదార్ధాలు
  10. అల్లం వెల్లుల్లి పాయ ముక్కలు ఒక చెంచా
  11. చిన్న ఉల్లిపాయ ముక్కలు 1
  12. క్యాప్సికమ్ ముక్కలు ఒక స్పూన్
  13. పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్
  14. టమాట సాస్ ఒక స్పూను
  15. చిల్లి సాస్ ఒక స్పూను
  16. సోయాసాస్ 1 స్పూను
  17. స్ప్రింగ్ ఆనియన్స్ చిన్నగా తరిగినవి రెండు స్పూన్లు
  18. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా బేబీ కార్న్ నిమిషాలు మధ్యలోకి చీల్చి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నెలోకి మైదాపిండి , కార్న్ ఫ్లోర్, అల్లంవెల్లుల్లి ముద్ద,ఉప్పు కారం మిరియాల పొడి వేసి అన్నీ కలిపి కొద్దిగా నీరు పోసి వేసి ముద్దలా చేయాలి.
  3. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న బేబీకార్న్ ముక్కలను ముంచి ఉంచాలి.
  4. ఇప్పుడు ఆయిల్ వేసి మూకుట్లో బాగా కాగనివ్వాలి.
  5. ఇవి కాగాక ముందుగా సిద్ధం చేసుకున్న బేబీకార్న్ ముక్కలు నూనెలో వేసి చిన్న మంట మీద దోరగా వేయించాలి.
  6. ఇప్పుడు గ్రేవీకోసం ఒక వాన నీళ్ళు కొద్దిగా నూనె వేసి అందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి.
  7. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసి కొంచెం సేపు వేగాక పచ్చిమిర్చి వెయ్యాలి.
  8. ఇప్పుడు అందులో కారం కొద్దిగా ఉప్పు వేసి వేగనివ్వాలి.
  9. ఇప్పుడు ఈ మిశ్రమంలో టమాటా సాస్ చిల్లి సాస్ సోయాసాస్ ఒక్క స్పూన్ వేసి బాగా కలపాలి.
  10. ఇప్పుడు ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుని కొద్దిగా నీరు పోసి దానిని పల్చగా చేసి పైన మరుగుతున్న దాంట్లో వెయ్యాలి.
  11. ఇది కొంచెం సేపు మగ్గాక పైన స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేస్తే ఎంతో రుచిగా ఉండే చిల్లి బేబీకార్న్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర