కజ్జికాయలు | Gujjia Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Gujjia by Sree Vaishnavi at BetterButter
కజ్జికాయలుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

కజ్జికాయలు వంటకం

కజ్జికాయలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gujjia Recipe in Telugu )

 • నెయ్యి - 5చెంచాలు
 • మైదాపిండి - 2 కప్పులు
 • ఉప్పు - 1/2 చెంచా
 • బొంబాయి రవ్వ - ½ కప్పు
 • ఎండుకొబ్బరి పొడి (ఖోయా లేదా మావా) -200 గ్రాములు
 • జీడిపప్పుల ముక్కలు - ½ కప్పు
 • బాదం పప్పుల ముక్కలు - ½ కప్పు
 • కిస్మిస్ లు - 15-18
 • చక్కెరపొడి - 3/4వకప్పు
 • ఏలకుల పొడి - 1/2 చెంచా
 • నూనె వేయించటానికి
 • కజ్జికాయల అచ్చు

కజ్జికాయలు | How to make Gujjia Recipe in Telugu

 1. పెద్ద గిన్నెలో మైదాపిండిని తీసుకుని, 3 చెంచాల నెయ్యిని కలపండి.
 2. బాగా కలిపి పావు కప్పు నీళ్ళు కొంచెం కొంచెంగా పోస్తూ, గట్టి ముద్దలాగా కలపండి.
 3. 2-3చుక్కల నెయ్యిని వేసి మళ్ళీ కలపండి.
 4. తడి గుడ్డను ఆ పిండిముద్దపై కప్పి అరగంట సేపు నాననివ్వండి.
 5. అదే సమయంలో రవ్వను వేడి కడాయిలో పోసి, పొడిగా వేయించండి. గోధుమరంగులోకి మారాక ,పక్కకి తీసి ఉంచి చల్లబడనివ్వండి.
 6. తర్వాత వేడి కడాయిలో ఎండుకొబ్బరిని కూడా వేయండి.
 7. అరచెంచా నెయ్యిని వేసి బాగా కలపండి.
 8. మాడిపోకుండా కలుపుతూ గట్టిపడేదాకా ఉంచండి.
 9. స్టవ్ పై నుంచి తీసేసి చల్లబడనివ్వండి.
 10. వేడిపెనంలో చెంచాడు నెయ్యి వేసి వేడెక్కనివ్వండి
 11. జీడిపప్పులు, బాదం, కిస్మిస్ లను వేయండి.
 12. అవన్నీ వేగేదాకా బాగా కలపండి.
 13. స్టవ్ పై నుండి తీసేసి సరిగ్గా చల్లబడనివ్వండి.
 14. చల్లబడిన ఎండుకొబ్బరిని గిన్నెలో తీసుకుని, వేయించిన రవ్వను కలపండి.
 15. వాటికి వేయించిన డ్రైఫ్రూట్లను, ఏలకుల పొడిని కలపండి.
 16. పంచదారపొడిని కూడా వేసి అన్నిటినీ బాగా కలపండి.
 17. చేతికి కొంచెం నూనె రాసుకుని జిడ్డు చేసుకోండి.
 18. కొంచెం పిండి ముద్దను తీసుకుని, చేతితో ఉండలు చేసి దాన్ని వత్తండి.
 19. అప్పడాల కర్రతో పూరీల్లాగా వాటిని వత్తండి.
 20. గుజియా లేదా కజ్జికాయ అచ్చును ఈ లోపల నూనె రాసి జిడ్డుచేయండి.
 21. ఈ వత్తిన పూరీలాంటి పిండిని ఆ అచ్చులో పెట్టండి.
 22. ఎండుకొబ్బరి మిశ్రమాన్ని దాని లోపల పెట్టి అన్నివైపులా పిండి అతుక్కోడానికి నీటిని రాయండి.
 23. అచ్చును మూసేసి అన్నివైపులా వత్తండి.
 24. బయటకి వచ్చిన మిగిలిన పిండిని తీసేయండి.
 25. అన్నివైపులా సరిగ్గా వత్తి, అచ్చును జాగ్రత్తగా తెరచి కజ్జికాయను బయటకి తీయండి.
 26. దాన్ని గుడ్డతో కప్పండి.
 27. అదే సమయంలో బాండీలో నూనెను మధ్యమంటతో కాగనివ్వండి.
 28. నూనె సరియైన స్థాయిలో మరిగిందో లేదో చూడటానికి కొంచెం పిండిని వేసి చూడవచ్చు. అది వెంటనే పైకి తేలితే నూనె కాగినట్టు.
 29. కొన్ని కజ్జికాయలను నూనెలో మెల్లగా వేయించటానికి వేయండి.
 30. అవి బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేగనివ్వండి, వెనక్కి తిప్పి కూడా వేయించండి. (ఒక్కో కజ్జికాయ వేగటానికి 10-15నిమిషాల సమయం పడుతుంది.)
 31. వేగాక, పళ్ళెంలోకి తీసుకోండి

నా చిట్కా:

పిండి కలిపేటప్పుడు సరిపడినంత నీరుమాత్రమే కలపండి.మరీ పల్చగా లేదా మరీ గట్టిగా అవకూడదు.

Reviews for Gujjia Recipe in Telugu (0)