పనీర్ బటర్ మసాల | Paneer butter masala Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Paneer butter masala recipe in Telugu,పనీర్ బటర్ మసాల, Indira Bhaskar
పనీర్ బటర్ మసాలby Indira Bhaskar
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

పనీర్ బటర్ మసాల వంటకం

పనీర్ బటర్ మసాల తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paneer butter masala Recipe in Telugu )

 • పనీర్ 200 గ్రాములు
 • బటర్ 100 గ్రాములు
 • ఉల్లిపాయ ఒకటి
 • టమాటాలు 3
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
 • పాలు ఒక పావులీటరు
 • ధనియాల పొడి ఒక చెంచా
 • జీలకర్ర పొడి ఒక చెంచా
 • గరంమసాలా ఒక చెంచా
 • కారం ఒక చెంచా
 • ఉప్పు ఒక చెంచా
 • tomato ketchup ఒక చెంచా
 • కసూరి మేథీ ఐదు రేఖలు

పనీర్ బటర్ మసాల | How to make Paneer butter masala Recipe in Telugu

 1. ముందుగా ఒక బాణలి పెట్టి అందులో రెండు స్పూన్లు బటర్ వేసి వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేపాలి.
 2. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పైన మిశ్రమంలో వేసి బాగా వేగనివ్వాలి.
 3. ఇప్పుడు పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పనీర్ ముక్కల్ని పైన టమాట ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఒక నిముషం మగ్గనివ్వాలి.
 4. ఇప్పుడు ఒక బౌల్లో పాలు పోసి అందులో ఉప్పు ,కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి ,గరం మసాలా పొడి , tomato ketchupవేసి అన్ని కలిసేలా బాగా కలపాలి.
 5. ఇప్పుడు ఈ పాల మిశ్రమాన్ని పైన వేగుతున్న పనీర్ మిశ్రమంలో వేసి మూతపెట్టి చిన్నమంట మీద మగ్గనివ్వాలి.
 6. ఇప్పుడు మిగిలిన బటర్ ని పై మిశ్రమంలో వేసి మరికొద్దిసేపు దగ్గరపడేవరకు మగ్గనివ్వాలి.
 7. ఇప్పుడు కసూరి మేథీ ని వేసి ఇంకొక 5 నిమిషాలు ఉంచి నెయ్యి పైకి వచ్చేవరకు ఉంచి కూర దగ్గరపడే వరకు ఉంచాలి.
 8. అంతే ఎంతో గుమగుమలాడే పనీర్ బటర్ మసాలా రెడీ.

నా చిట్కా:

వేసిన బటర్ అంత పైకి తేలేవరకు ఉంచి మగ్గనివ్వాలి లేదంటే కూర పచ్చి వాసన ఉంటే బాగోదు.

Reviews for Paneer butter masala Recipe in Telugu (0)