క్యారట్ బర్ఫీ | Carrot burfi Recipe in Telugu

ద్వారా Pranali Deshmukh  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Carrot burfi recipe in Telugu,క్యారట్ బర్ఫీ, Pranali Deshmukh
క్యారట్ బర్ఫీby Pranali Deshmukh
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

క్యారట్ బర్ఫీ వంటకం

క్యారట్ బర్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot burfi Recipe in Telugu )

 • క్యారెట్ తురుము - 1 కప్
 • కొబ్బరి తురుము - 1 కప్
 • పంచదార - 1కప్
 • నెయ్యి / డాల్డా - 100 grms
 • ద్రాక్ష - 25 grms
 • యాలకలు - 4
 • జీడిపప్పు - 25 grms
 • పిస్తా - 25 grms
 • తయారు చేయు విదానం:

క్యారట్ బర్ఫీ | How to make Carrot burfi Recipe in Telugu

 1. ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి తురిమి పెట్టుకొన్న క్యారెట్, కొబ్బరి అందులో వేసి కొంచెం దోరగా వేపి తీసి పక్కన పెట్టుకోవాలి.
 2. అదే పాన్ లో మరి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించి ఒక బౌల్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి
 3. ఇప్పుడు పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీరు పోసి, యాలకల పొడి చల్లి బాగా కలపాలి కొద్దిగా వేడి అయిన తర్వాత వేయించి పెట్టుకొన్న డ్రైఫ్రూట్స్ లో సగ బాగాన్ని అందులో వేసి బాగా కాచి ముదురు పాకం వచ్చేవరకు స్పూన్ తో కలుపుతూ ఉండాలి.
 4. పంచదార పాకం దగ్గర పడే సమయంలో అందులో వేయించి పెట్టుకొన్న క్యారెట్, కొబ్బరి తురుము అందులో వేసి కొద్దిగా గట్టిపడ్డాక, ఆ మిశ్రమాన్ని తీసి మందపాటి వెడల్పైన ప్లేటుకు కొద్దిగా నెయ్యి రాసి అందులో వేసి దాని మీద కూడా డ్రైఫ్రూట్స్ చల్లి ఆరిన తర్వాత మనకు కావలసిన ఆకారంలో కట్ చేసి సర్వ్ చేయవచ్చు.

Reviews for Carrot burfi Recipe in Telugu (0)