హోమ్ / వంటకాలు / పనసకాయ బిరియాని

Photo of Jack fruit biriyani by Sree Sadhu at BetterButter
405
4
0.0(0)
0

పనసకాయ బిరియాని

Jul-01-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనసకాయ బిరియాని రెసిపీ గురించి

ఇది చాల రుచిగా నాన్ వెజ్ తో సమానం గ ఉంటుంది అదిరిపోయే పనసకాయ దమ్ బిరియాని

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. పనసకాయ ముక్కలు : 1 కప్పు
  2. బాస్మతి రైస్ : 2 కప్పులు
  3. అల్లం వెల్లుల్లిపేస్ట్ : 1 స్పూన్
  4. బిరియాని ఆకులు 3
  5. మరాఠి మొగ్గ : 2
  6. షాజీరా : ఒక స్పూన్
  7. స్టార్ : 3
  8. ఇలాచీ : 4
  9. చెక్క : చిన్న ముక్క
  10. లవంగాలు : 4
  11. ఉల్లిపాయముక్కలు : అరకప్పు
  12. పచ్చిమిర్చి చీలికలు : 4
  13. పుదీనా : అరకప్పు
  14. కొత్తిమీర : అరకప్పు
  15. కుంకుమపువ్వు : చిటికెడు
  16. మిల్క్ : రెండు స్పూన్లు
  17. నెయ్యి : మూడు స్పూన్లు
  18. ఆయిల్ : తగినంత
  19. గరం మసాలా పొడి : ఒక స్పూన్
  20. కారం : ఒక స్పూన్
  21. పసుపు : అరస్పూన్
  22. సాల్ట్ : తగినంత
  23. జీడిపప్పు : 4
  24. పచ్చి కొబ్బరి ముక్క : చిన్నది
  25. పెరుగు :ఒక కప్పు

సూచనలు

  1. ముందుగా బాస్మతి రైస్ ను కడిగి అరగంటపాటు నాననివ్వాలి .
  2. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసి మరగనివ్వాలి , మరిగాక అందులో బిరియాని ఆకూ , షాజీరా , ఇలాచీ , లవంగం , సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి అందులో ముందుగా నానపెట్టిన రైస్ వేసి 70% ఉడకనివ్వాలి.
  3. దీన్ని వడకట్టుకుని అన్నాన్ని పక్కన ఉంచుకోవాలి
  4. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో పనసకాయ ముక్కలు , పసుపు , అల్లం వెల్లుల్లిపేస్ట్ , సాల్ట్ వేసి కలుపుకి పక్కన ఉంచుకోవాలి.
  5. మిక్స్ జార్ తీసుకుని అందులో జీడిపప్పు , కొబ్బరిముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి .
  6. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించుకుని తీసుకుని పక్కనపెట్టుకోవాలి.
  7. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి ,ఆయిల్ వేసుకుని అందులో బిరియాని ఆకూ వేసి అందులో గరం మసాలాదినుసులను కొంచెం దంచుకుని వేసుకోవాలి .
  8. వేగాక అందులో, ఉల్లిపాయముక్కలు , పచ్చిమిర్చిముక్కలు , వేసి వేపుకుని ముందుగా కలిపిపెట్టుకున్న పనసకాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి.
  9. ఇప్పుడు ఇందులో జీడిపప్పు , కొబ్బరికాయ పేస్ట్, కారం ,సాల్ట్ , వేసి మరల కాసేపు మగ్గనివ్వాలి
  10. మగ్గాక కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి కలిపి చిన్నమంటమీద 5 నిముషాలు ఉడకనివ్వాలి.
  11. ఇప్పుడు దీనిమీద ముందుగా 70% ఉడికించుకున్న రైస్ వేసి పరుచుకోవాలి
  12. దాని పైన ముందుగా వేయించుకున్న ఉల్లిపాయముక్కలు ,కొంచెం కొత్తిమీర , పుదీనా , గరం మసాలా పొడి , పాలలో కలుపుకున్న కుంకుమ పువ్వు ను వేసుకుని దీనిపైనా కొంచెం నెయ్యి వేసుకుని కుక్కర్ మూతపెట్టి ఒక పది నిముషాలు చిన్నమంట పైన దమ్ చేసుకోవాలి , కుక్కర్ విజిల్ పెట్టకూడదు.
  13. అంతే పనసకాయ దమ్ బిరియాని రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర