బాదుషా | Badusha Recipe in Telugu

ద్వారా Vijaya Chinta  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Badusha recipe in Telugu,బాదుషా, Vijaya Chinta
బాదుషాby Vijaya Chinta
 • తయారీకి సమయం

  11

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

బాదుషా వంటకం

బాదుషా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Badusha Recipe in Telugu )

 • 2 టేబుల్ స్పూన్లు
 • పెరుగు - 3 టేబుల్ స్పూన్లు
 • బేకింగ్ సోడా - ¼ టేబుల్ స్పూన్లు
 • ఉప్పు - ½ టేబుల్ స్పూన్లు
 • మైదా - 1 కప్
 • షుగర్ - 1½ కప్
 • నీరు - ½ కప్
 • ఏలకులు పొడి - ¼ టేబుల్ స్పూన్లు

బాదుషా | How to make Badusha Recipe in Telugu

 1. ఒక గిన్నెలో కాస్త నెయ్యిని తీసుకోండి
 2. దానికి పెరుగు జోడించండి.
 3. బేకింగ్ సోడా, ఉప్పు కలపాలి.
 4. ఫై మిశ్రమాలన్నింటిని బాగా కలపండి.
 5. ఇప్పుడు మైదాని ఒక కప్పు వేసి బాగా కలపాలి.
 6. ఈ మిశ్రమం మొత్తం మెత్తగా చేతికి అంటుకోకుండా ఉండేంతవరకు దానిని బాగా కలపండి.
 7. ఇప్పుడు అందులోనుండి కొంత భాగాన్ని తీసుకొని మీ అరచేతుల సహాయం తో పిండిని గుండ్రంగా చేయండి.
 8. ఇప్పుడు ఒక టూత్పిక్ వుపయోగించి మరియు మధ్యలో ఒక చిన్న రంద్రం చేయండి.
 9. దానిని పాన్ లో ఆయిల్ లో ఫ్రై చేయండి.
 10. ఇదే విధంగా మరికొన్ని ముక్కలను ఆయిల్ లో ఒక దాని తర్వాత ఒకటి అంటుకోకుండా
 11. వాటిని తక్కువ మంట మీద వేడి చేయండి.
 12. మరొక వైపు కూడా ఉడికించడానికి తిప్పుతూ ఉండాలి.
 13. రెండు వైపులా బంగారు గోధుమ రంగు మారిపోయేంత వరకు వేయించాలి.
 14. గోధుమ వర్ణంలోకి మారాక వాటిని బయటకి తీసి ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లబరచండి.
 15. ఇంతలో, మరొక పాన్ లో, చక్కెర ను తీసుకోండి.
 16. దానికి తగినంత నీటిని కలపండి.
 17. చక్కెర కరగడానికి మరియు సిరప్ వేడి అవడానికి సుమారు 2 నిముషాలు ఉండనివ్వండి.
 18. తరువాత పాకం చిక్కబడ్డాక స్టవ్ ని ఆపేయండి.
 19. ఇప్పుడు చక్కెర సిరప్లో ఫ్రై చేసుకున్న వాటిని కలపండి.
 20. దీనిని 10-15 నిమిషాలు నానబెట్టండి.
 21. బాగా మెత్తబడిన తరువాత సిరప్ నుండి ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లబరచండి.
 22. షుగర్ సిరప్ అంతా ఆవిరి అయిన తర్వాత, బాదుషా రెడీ అయినట్లే.

Reviews for Badusha Recipe in Telugu (0)