గోధుమ పాల హాల్వా | Wheet milk halwa. Recipe in Telugu

ద్వారా Swapna Tirumamidi  |  3rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Wheet milk halwa. recipe in Telugu,గోధుమ పాల హాల్వా, Swapna Tirumamidi
గోధుమ పాల హాల్వాby Swapna Tirumamidi
  • తయారీకి సమయం

    1

    1 /2గంటలు
  • వండటానికి సమయం

    60

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

గోధుమ పాల హాల్వా వంటకం

గోధుమ పాల హాల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Wheet milk halwa. Recipe in Telugu )

  • తెల్ల గోధుమలు 200 గ్రా..
  • పంచదార 500 గ్రా..
  • నెయ్యి 200 ..గ్రా
  • జీడిపప్పు, పిస్తా పలుకులు,బాదం కలిపి 150 గ్రా..

గోధుమ పాల హాల్వా | How to make Wheet milk halwa. Recipe in Telugu

  1. గోధుమపాల హల్వా తయారీ, గోధుమలు కడిగి 3 రోజులు నానపెట్టాలి.
  2. 3 వరోజు ఆ నీరు తీసేసి ఒకసారి కడిగి వార్చి.కొద్దిగా నీరు పోసి మెత్తగా మిక్సీ లో రుబ్బాలి. .
  3. ఆ మిశ్రమాన్ని ఒక సన్నని జల్లెడ లో వేసి వడకొట్టి,మళ్లా కొద్దిగా నీరుపోసి మిక్సీ వేసి మళ్ళీ వడకొట్టాలి..ఇలా రెండు మూడు సార్లు చెయ్యాలి.
  4. ఇలా వచ్చిన పాలను ఒక గంట పాటు కడపకుండా మూత పెట్టి పక్కన పెట్టాలి.... అప్పుడు నీరు అంతా పైకి ,చిక్కని పాలు కిందకి తేరుకుని ఉంటాయి.
  5. అప్పుడు పైన తేరిన నీటిని వేరే గిన్నీలోకి జాగర్తగాతీసి పెట్టుకుని, ఇప్పుడు మిగిలిన చిక్కని గోధుమపాలను గ్లాసు తో కొలిచి దానికి 3 రేట్లు నీరు పోయాలి.
  6. అంటే ఉదాహరణకి ఒక గ్లాసు గోధుమపాలు వేస్తే 3 గ్లాసులు నీరు పోయాలి.(ఈ నీటి కోసం ఇందాక తేర్చి వేరే గిన్నె లో పోసిన నీటిని వాడుకోవచ్చు.) ఇప్పుడు పంచదారను ఒక వెడల్పాటి మందంగావున్న మూకుడులో వేసి అరగ్లాసు నీరు పోసి పొయ్యి మీద పెట్టి పాకం పట్టాలి.ఒక తీగ పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి.
  7. ఇప్పుడు నచ్చిన ఫ్యూడకలర్ కొద్దిగాపాకంలో వేసి కలిపి. గోధుమపాలను ఒకసారి బాగా కలిపి ఈ పాకంలో పోసి బాగా కలపాలి.పది నిముషాలు కలిపి ఒక గరిట నెయ్యివేసి మళ్ళీ తిప్పుతూ ఉండాలి . ఇంకో పది నిముషాల తరువాత కొద్దిగా దగ్గర పడుతుంది ,అప్పుడు ఇంకో గరిట నెయ్యి వేసి మళ్ళీ తిప్పాలి.
  8. ఒక 20 నిమిషాలు అలా ఉడికించి మళ్ళీ నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. మరో 20 నిమిషాలకి నెయ్యి, హల్వా ని వదిలి అంచులకు చేరి,హల్వా కూడా మూకుడు కి అంటకుండా ఫ్రీ గా తిరిగేలా ముద్దలా అవ్వాలి.ఇప్పుడు వేయించిన జీడీ పప్పులు,పిస్తాలు పలుకులు,బాదం పలుకులు.వేసి బాగా కలిపితే హల్వా రెడీ.
  9. ఇలా వేడి గా తినెయ్యచ్చు లేదా ఒక అంచులున్న పళ్లానికి నెయ్యి రాసి అందులో హల్వా పోసి పరుచుకోవాలి. పైన కొన్ని పప్పులతో గార్నిష్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారాక చాకుకి,చేతికి కి నెయ్యి

నా చిట్కా:

బయట కొన్న హల్వా లా కొంచెం పులుపు రుచి రావాలి అనుకుంటే.... పంచదార పాకం రెడి అయ్యాక నిమ్మరసం కానీ,కాస్త నిమ్మఉప్పు వేయండి.

Reviews for Wheet milk halwa. Recipe in Telugu (0)