ఖజ్జురం హల్వా | DATES HALWA. Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  3rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • DATES HALWA. recipe in Telugu,ఖజ్జురం హల్వా, Swapna Sashikanth Tirumamidi
ఖజ్జురం హల్వాby Swapna Sashikanth Tirumamidi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

3

0

About DATES HALWA. Recipe in Telugu

ఖజ్జురం హల్వా వంటకం

ఖజ్జురం హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make DATES HALWA. Recipe in Telugu )

 • మెత్తని ఖజ్జురాలు 1 కేజీ
 • మెత్తని గోధుమ పిండి 1/4 కేజీ
 • కమ్మని నెయ్యి 1/4 కేజీ
 • యాలకుల పొడి అర చెంచా
 • కాజు/బాదం/పిస్తా...ఒక కప్పు.
 • వేయించిన నువ్వులు(నా దగ్గర లేక వెయ్యలేదు. కానీ ఇది వేస్తే మరింత రుచి వస్తుంది)

ఖజ్జురం హల్వా | How to make DATES HALWA. Recipe in Telugu

 1. ఖజ్జురం హల్వా తయారీ. ముందుగా ఖజ్జురాలు అన్ని లోపల గింజలు తీసేసి శుభ్రం చేసుకుని...ముద్దలా అయ్యేలా మొమ్మోమ్ముగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
 2. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న వెడల్పాటి మూకుడు పొయ్యిమీద పెట్టి అందులో నెయ్యివేసి కరిగించాలి ,
 3. అందులోడ్రై ఫ్రూట్స్,నువ్వులు వేసి కొద్దిగా వేగగానే, గోధుమ పిండి వేసి బాగా కమ్మని సువాసన వచ్చేదాకా 10 నిముషాలు వేయించాలి.
 4. కమ్మని సువాసన రాగానే అందులో ఖజ్జురం ముద్దవేసి బాగా కలపాలి... ఈ కలపడమే కాస్త జాగర్తగా చెయ్యాలి...పిండి ,ఖజ్జురం,డ్రై ఫ్రూట్స్ అంతటా కలిసేలా అట్లకాడ తో 10 నిముషాలు కలపి దించేయాలి.
 5. ఇప్పుడు యాలకుల పొడి వేసి మళ్ళా ఒకసారి కలపాలి. ఇప్పుడు ఒక వెడల్పు పళ్లెం లో కొద్దిగా నెయ్యిరాసి ఈ ముద్దని వేసి స్ప్రెడ్ చేసి పైన జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలి. ఇది మిగతా హల్వాల్లా ముక్కలుగా కట్ చేయబడదు .

నా చిట్కా:

ఐటమ్ స్టార్ట్ చేసింది మొదలు చెయ్యి ఆపకుండా తిప్పాలి...ఖజ్జురం గట్టిగా ఉంటుంది కాబట్టి. అడుగంటకుండా చూసుకోవాలి...

Reviews for DATES HALWA. Recipe in Telugu (0)