Photo of Boondi laddu by Sree Sadhu at BetterButter
665
5
0.0(1)
0

Boondi laddu

Jul-06-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 5

  1. శనగపిండి - అరకిలో
  2. చక్కెర - ఒక కిలో
  3. నెయ్యి - ముప్పావు కిలో
  4. జీడిపప్పు - 100 గ్రా.
  5. ఎండుద్రాక్ష - 30 గ్రా.
  6. ఏలకులు - 10 గ్రా.
  7. పచ్చ కర్పూరం
  8. కుంకుమ పువ్వు
  9. మిఠాయి రంగు

సూచనలు

  1. శనగ పిండి ఒక కళాయి గిన్నెలో గరిటె జారుగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా బాగా కలిసేటట్టుగా కలపాలి.
  2. చక్కెరలో ఒక లీటరు నీళ్ళుపోసి ఆ గిన్నెను పొయ్యిమీద పెట్టి గరిటెతో తిప్పుతూ ఉండాలి.
  3. ఈ పాకాన్ని వేళ్ళతో పట్టుకొని చేస్తే కొంచెం తీగరావాలి. దీనిని లేతపాకం అంటారు.
  4. ఒక స్పూనులో పాలుపోసి, చిటికెడు మిఠాయిరంగు కలిపి, ఆ పాలు పాకంలో పోసి ఒక్కసారి తిప్పితే పాకానికి మిఠాయిరంగు వస్తుంది.
  5. తరువాత పాకం గిన్నెను దించి పక్కగా ఉంచుకోవాలి.
  6. నెయ్యి బూరెలమూకుడులో పోసి మరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ పండ్లు వేసి, వేయించి తీసి ఒక పక్కగా పెట్టుకోవాలి.
  7. శనగ పిండి ముద్దని ఒక కప్పుతోగాని, గరిటెతో గాని తీసుకొని సన్నని రంధ్రాలు గలిగి లోతుగా ఉన్న చట్రంలో పొయ్యాలి.
  8. దానినుండి చిన్న చిన్న బిందువులుగా పెనంలో పడతాయి. అలా పెనం నిండా పడిన తరువాత చట్రం ముద్దలో ఉంచాలి.
  9. బూందీ ఎరుపురంగుగా వేగకమునుపే, అనగా పసుపు పచ్చరంగులో ఉన్నప్పుడే మెరకగా ఉన్న రెండో చట్రంతో దేవి, పక్కనున్న పాకం గిన్నెలో వేయాలి; గరిటెతో కిందనుండి పైకి, పైనుండి కిందకి కలియబెట్టాలి.
  10. శనగపిండి ముద్ద ఎక్కువగా ఉంటే ఇదే పద్ధతిని మళ్ళీ మళ్ళీ చెయ్యాలి.
  11. బూందీ వెయ్యడం పూర్తయ్యాక వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ పండ్లు కూడా పాకంలో వెయ్యాలి.
  12. తరువాత ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం కలపాలి.
  13. చల్లారిన తర్వాత కావలసినంత పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి.
  14. ఉండకడుతున్నప్పుడు విడిపోతున్నట్లు తోసిన, అరచేత్తో నొక్కినట్లయితే విడిపోవు. ఉండల్ని గాలి తగిలేటట్లుగా పదినిమిషాలు ఉంచాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Bhargavi Kommareddy
Aug-20-2019
Bhargavi Kommareddy   Aug-20-2019

:thumbsup:

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర