బాదం ఖీర్ | Badam kheer Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  7th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Badam kheer recipe in Telugu,బాదం ఖీర్, Indira Bhaskar
బాదం ఖీర్by Indira Bhaskar
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

బాదం ఖీర్ వంటకం

బాదం ఖీర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Badam kheer Recipe in Telugu )

 • పాలు రెండు కప్పులు
 • బియ్యం ఒక అరకప్పు (కాల్ బాస్మతి బియ్యం)
 • నానపెట్టిన బాదం పప్పులు పేస్ట్ అర కప్పు
 • పంచదార అరకప్పు
 • ఇలాచి పౌడర్ పావు టేబుల్ స్పూన్
 • బాదం పప్పులు 4

బాదం ఖీర్ | How to make Badam kheer Recipe in Telugu

 1. ముందుగా ఒక మందపాటి మూకుడులో పాలు పోసి మరిగించాలి.
 2. ఇప్పుడు పాలు మరిగాక బియ్యాన్ని నూకల చేసి పాలలో వేయాలి.
 3. ఇలా నూకని ఒక పదిహేను నిమిషాల పాటు చిన్న మంట మీద వుడక పెట్టాలి.
 4. ముందుగా బాదం పప్పుల్ని ఒక అరగంట నీటిలో నానబెట్టి పేస్ట్లా చేసి ఉంచుకోవాలి.
 5. ఇప్పుడు నూక ఉడికాక బాదంపప్పు పేస్ట్ కూడా వేసి ఇంకో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి.
 6. ఇప్పుడు ఇవన్నీ బాగా మరుగుతున్నప్పుడు పంచదార కూడా వేసి ఇంకో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి.
 7. దీంట్లో అప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా కలపాలి.
 8. ఈ విధంగా దగ్గర పడుతున్నట్టు అనిపించినప్పుడు మన బాదం ఖీర్ తయారయినట్టే.
 9. దీనిని పైన కట్ చేసుకున్న బాదం పప్పులతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.

నా చిట్కా:

చల్లని పదార్థాలు ఇష్టపడేవారు దీన్ని ఫ్రిజ్లో పెట్టి కూడా చల్లగా తీసుకుంటే ఎంతో బాగుంటుంది.

Reviews for Badam kheer Recipe in Telugu (0)