లోటస్ క్రిస్ప్ | Lotus crisp Recipe in Telugu

ద్వారా Seetha Sadhu  |  8th Jul 2018  |  
5 నుండి 2సమీక్షలు రేటు చెయ్యండి!
  • Lotus crisp recipe in Telugu,లోటస్ క్రిస్ప్, Seetha Sadhu
లోటస్ క్రిస్ప్by Seetha Sadhu
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    36

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

2

లోటస్ క్రిస్ప్ వంటకం

లోటస్ క్రిస్ప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lotus crisp Recipe in Telugu )

  • కొబ్బరి తురుము 1 కప్
  • తరిగిన బాదంపప్పు 1/2 కప్
  • తరిగిన పిస్తాపప్పు 1/2 కప్
  • తరిగిన ఆక్రూట్ 1/2 కప్
  • కుంకుమ పువ్వు 2-3 రేకులు
  • ఆకుపచ్చ రంగు చిటికెడు
  • ఎరుపు రంగు చిటికెడు
  • కేసర్ రంగు చిటికెడు
  • మైదా పిండి 2-3 కప్పులు
  • నూనె 1/2 కప్
  • నీళ్లు తగినంత
  • ఉప్పు చిటికెడు
  • పంచదార 1/2 కప్
  • నూనె వేయించడానికి సరిపడా
  • డార్క్ చాక్లెట్ 1/3 కప్
  • బేకింగ్ సోడా 1/2 చెంచా
  • బట్టర్ 1/2 కప్

లోటస్ క్రిస్ప్ | How to make Lotus crisp Recipe in Telugu

  1. ముందుగా ఈ పదార్థాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం బట్టర్ వేసి కరిగాక అందులో తరిగిన బాదం పప్పు, పిస్తాపప్పు, ఆక్రూట్ వేసి వేగనివ్వాలి
  3. వేగిన తరువాత అందులో తురిమిన కొబ్బరి వేసి మరో రెండు నిమిషాలు వేగనివ్వాలి అందులో ఇప్పుడు కరిగిన డార్క్ చాక్లెట్ వేసి బాగా కలుపుకోవాలి
  4. అది కొంచం చల్లారిన తరువాత వాటిని చిన్న చిన్న ఉండలు చేసి ఢిఫ్రిడ్జి లో పెట్టుకోవాలి
  5. ఇప్పుడు మనం పిండి కలుపుకోవాలి అందులో దానికి ఒక గిన్నె తీసుకొని అందులో మైదా పిండి వేసుకోవాలి
  6. దాంట్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలి
  7. అందులో కొంచం బేకింగ్ సోడా వేసుకోవాలి
  8. అందులో తగినంత పంచదార పొడి కూడా వేసుకోవాలి
  9. ఇప్పుడు అందులో నీళ్లు పోసుకొని ముద్ద ల చేసుకోవాలి దానికి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి
  10. ఇప్పుడు మళ్ళి ఒక గిన్నె లో మైదా పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా ,ఈసారి ఇందులో నీళ్లు పోయకూడదు మొత్తం నూనె ,పంచదార పొడి , కలుపుకోవాలి
  11. ఆ పిండిని మూడు బాగాలు చేసి వాటిలో ఎరుపు రంగు, కేసర్ రంగు ,ఆకుపచ్చ రంగు వేసుకొని కలుపుకోవాలి
  12. ఇప్పుడు మనం నీళ్లతో కలుపుకున్న పిండి లోంచి చిన్న బాల్ చేసి వత్తుకోవాలి
  13. దాని బాగా పల్చగా వత్తుకోవాలి
  14. దాని మీద ఎరుపు రంగు ముద్ద ని వత్తుకొని దాని మీద వేసుకోవాలి
  15. దాని సీడ్స్ కట్ చేసుకోవాలి ఒక గుండ్రమైన ప్లేట్ సహాయం తో
  16. ఇప్పుడు దాని మధ్యలో ఫ్రిడ్జ్ లో పెట్టిన బాల్స్ పెట్టుకోవాలి
  17. ఇప్పుడు దాని నాలుగు వైపులనుంచి మూసివేయాలి
  18. ఆ సీడ్స్ ని గట్టిగా మూసివేయాలి
  19. ఇప్పుడు పైన ఆ ఎక్సట్రా గ ఉన్నది కట్ చేసి మధ్యలో పెట్టుకోవాలి
  20. ఇప్పుడు అలాగే ఆకుపచ్చ రంగుది చేసుకోవాలి
  21. ఇప్పుడు బాండి తీసుకొని అందులో నూనె వేసి కాగిన తరువాత చేసుకున్న దానిని మెల్లగా నూనె లో వేసి వేయించుకోవాలి అంతే

నా చిట్కా:

నూనె లో కొంచెం వేడిగా ఉండాలి ఎక్కువ వేడిగా ఉండకూడదు ఉంటె మన క్రిస్పీ తొందరగా మాడిపోతుంది

Reviews for Lotus crisp Recipe in Telugu (2)

Sree Vaishnavi6 months ago

Superb
జవాబు వ్రాయండి

Vijaya Chinta6 months ago

Excellent share......
జవాబు వ్రాయండి