కొబ్బరి బాదం భరిణలు | Kobbari Badam Bharinalu Recipe in Telugu

ద్వారా Abhinetri V  |  8th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Kobbari Badam Bharinalu recipe in Telugu,కొబ్బరి బాదం భరిణలు, Abhinetri V
కొబ్బరి బాదం భరిణలుby Abhinetri V
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

కొబ్బరి బాదం భరిణలు వంటకం

కొబ్బరి బాదం భరిణలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kobbari Badam Bharinalu Recipe in Telugu )

 • స్టఫ్ కోసం- కొబ్బరి పొడి , డ్రై/ఎండు - 1 కప్పు
 • బాదం పొడి- 1/4 కప్పు
 • చెక్కర పొడి - 1 కప్పు
 • దాల్చిన చెక్క పొడి - 1/4 టీస్పూన్
 • పై భాగం/ భరిణలు కోసం - మైదా- 1 కప్పు
 • వనస్పతి నెయ్యి- 1.5 కప్స్
 • ఉప్పు- చిటికెడు
 • చెక్కర పొడి - 1/2 కప్పు
 • నేచురల్ పసుపు రంగు(కావాలనుకుంటే) - చిటికెడు
 • క్యారెట్ స్వీట్ సాస్ కోసం - క్యారెట్- 2
 • వనస్పతి నెయ్యి- 3 టేబుల్ స్పూన్స్
 • దాల్చిన చెక్క పొడి - చిటికెడు
 • ఖర్జూరం- 1/2 కప్పు

కొబ్బరి బాదం భరిణలు | How to make Kobbari Badam Bharinalu Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నెలో మైదా, తగినంత ఉప్పు మరియు చెక్కర పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కాస్త వేడిచేసి పెట్టుకున్న వనస్పతి నెయ్యిని వేసి చపాతీ ముద్ద మాదిరిగా ఒక ముద్దని/డో ను తయారు చెయ్యాలి. ఈ ముద్దని కాసేపు పక్కన పెట్టుకోవాలి.
 2. ఇంతలోపు డ్రై/ఎండు కొబ్బరిపొడి ని సన్నని సెగపైన రెండు నుండి 5 నిమిషాల దాకా వేగనివ్వాలి.
 3. ఈ పొడిని ఒక పొడిగా ఉన్న గిన్నెలో వేసుకొని, అందులో బాదంపొడి, చెక్కర పొడి మరియు దాల్చిన చెక్క పొడి వేసి అన్ని వైపులా కలపాలి.
 4. ముందుగా తయారు చేసి పెట్టుకున్న మైదా ముద్దని తీసుకొని అందులో నుండి చిన్న సైజ్ ముద్దలని తయారు చెయ్యాలి.
 5. ఈ చిన్న సైజ్ ముద్దలని భరిణల రూపంలో అద్ది, ఇందులో ముందుగా తయారు చేసి పెట్టిన స్టఫ్/కొబ్బరి-బాదం పొడి ని వేసుకొని కింద భాగం నుండి చక్కగా మూసివేయ్యాలి.
 6. ఇప్పుడు ఈ కొబ్బరి బాదం భరిణలుని ఒవెన్ లో పెట్టి 160డి C దెగ్గర 15 నిమిషాలు దాకా బేక్ చెయ్యాలి.
 7. బేక్ అయ్యేలోపు, ఒక బాణాలి లో 2 టీస్పాన్స్ నెయ్యి ని వేసి తురిమిన క్యారెట్ ని అందులో వేసుకొని, సన్నని సెగపైన వేగనివ్వాలి. క్యారెట్ వేగిన తరువాత , ఇందులో ఖర్జూరం పేస్ట్, దాల్చిన చెక్క పొడి ని కూడా వేసుకొని 2 నిమిషాలు పాటు ఉడకనివ్వాలి.
 8. ఓవెన్ నుండి బేక్ అయ్యిన కొబ్బరి బాదం భరిణలుని తీసి , కాస్త చల్లారాక స్వీట్ క్యారెట్ సాస్ తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

నా చిట్కా:

భరిణలు ని తయారు చెయ్యడానికి జ్యూస్ మేకర్ పై ఉండే క్రింద భాగంలో ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి, తయారు చేసాను.

Reviews for Kobbari Badam Bharinalu Recipe in Telugu (0)