పూర్ణం బూరెలు | Puran poli or purnam burelu Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  8th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Puran poli or purnam burelu recipe in Telugu,పూర్ణం బూరెలు, Indira Bhaskar
పూర్ణం బూరెలుby Indira Bhaskar
 • తయారీకి సమయం

  4

  గంటలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

4

0

పూర్ణం బూరెలు వంటకం

పూర్ణం బూరెలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Puran poli or purnam burelu Recipe in Telugu )

 • పచ్చిశనగపప్పు ఒక కప్పు
 • బెల్లం తురుము ఒక కప్పు
 • బాదం జీడిపప్పుల పొడి పావు కప్పు
 • ఇలాచీ పొడి పావు టీ స్పూన్
 • కిస్మిస్లు అర టీ స్పూన్
 • పైన తోపు పెట్టుకోడానికి కావలసినవి
 • మినప్పప్పు అరగ్లాసు
 • బియ్యం ఒక గ్లాసుడు
 • మైదాపిండి ఒక చెంచా
 • బేకింగ్ సోడా చిటికెడు
 • నూనె డీప్ ఫ్రైకి సరిపడా

పూర్ణం బూరెలు | How to make Puran poli or purnam burelu Recipe in Telugu

 1. ముందుగా పప్పు మినప్పప్పు బియ్యాన్ని మూడు గంటలసేపు నానబెట్టాలి.
 2. ఇప్పుడు ఈ నానపెట్టిన పప్పు బియ్యాన్ని దోసెల పిండిలాగా రుబ్బుకోవాలి.
 3. ఇప్పుడు ఇందులో మైదాపిండి , తినేసోడా వేసి బాగా కలుపుకుని కొద్దిసేపు పక్కనుంచాలి.
 4. ఇప్పుడు పచ్చి శెనగపప్పు ని కొద్దిగా నీరు పోసి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చేవరకు మెత్తగా ఉడకపెట్టుకోవాలి.
 5. ఈ లోపల ఒక మూడిట్లో బెల్లం తురుము వేసి అది బాగా కరిగి పాకం వచ్చేవరకు మరిగించాలి.
 6. ఇప్పుడు పైన ఉడకపెట్టుకుని శనగపప్పుని మిక్సిజార్లో వేసి కొంచెం బరకగా ముద్దగా అయ్యేలా మిక్సీ పట్టాలి.
 7. అది ఇలా కింద చూపిన విధంగా వస్తుంది.
 8. ఇప్పుడు దానిని పైన మరుగుతున్న పాకంలో వేసి బాగా కలపాలి.
 9. పైన ఉడుకుతున్న మిశ్రమంలో బాదం జీడిపప్పు కిస్మిస్ ఇలాచీ పొడి కూడా వేసి చిన్నమంటమీద ఉడకనివ్వాలి.
 10. ఇప్పుడు ఈ పైన మిశ్రమం అంతా దగ్గర పడి ఒక మెత్తని ముద్దలా తయారవుతుంది.
 11. ఇప్పుడు దీనిని చిన్నచిన్న ఉండల్లా మన కావలసిన సైజులో చేసి ఉంచుకోవాలి.
 12. ఒక మందపాటి మూకుట్లో నూనె వేసి బాగా మరగనివ్వాలి.
 13. ఇప్పుడు పైన చేసుకున్న పూర్ణం ఉండలని ముందుగా సిద్ధం చేసుకున్న పప్పు బియ్యం పిండిలో వేసి పిండి అంత బాగా పట్టేలా పిండిలో ఉంచి వేడి వేడి నూనెలో వేసి చిన్నమంటమీద ఎరుపురంగు వచ్చేవరకు వేయించాలి.
 14. అంతే దీనిని మధ్యలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో బాగుంటాయి.
 15. ఏ శుభ కార్యంలో అయిన ముందుగా వడ్డించే తియ్యని పూర్ణం బూరెలు రెడీ.

నా చిట్కా:

దీన్లో ఇష్టం ఉన్నవాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. వీటిని నెయ్యితో వడ్డన చేస్తే మరింత రుచిగా ఉంటాయి.

Reviews for Puran poli or purnam burelu Recipe in Telugu (0)