చిరోటి | Chiroti Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Jul 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Chiroti recipe in Telugu,చిరోటి, Sree Vaishnavi
చిరోటిby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

1

చిరోటి వంటకం

చిరోటి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chiroti Recipe in Telugu )

 • మైదాపిండి 2 కప్పులు
 • వెన్న 1 కప్పు
 • పంచదార పొడి 1 కప్పు
 • ఉప్పు 1 చెంచా
 • నూనె వేయించటానికి సరిపడా

చిరోటి | How to make Chiroti Recipe in Telugu

 1. ముందుగా మైదాపిండి లో వెన్న 1/2 కప్పు మరియు ఉప్పు వేసి బాగాకలపాలి .
 2. దానికి నీరు చేర్చి చపాతి పిండిలా కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి .
 3. చిన్నచిన్న ఉండలు గా చేసుకొని. పూరీలా ఒత్తి
 4. దానిమీద వెన్న పూయాలి . దానిని చాపలా చుట్టి రౌండ్ గ చుట్టి మళ్ళీ పూరీలా ఒత్తాలి
 5. అలా అన్ని ఉండలు పూరీలా చేసుకోవాలి .
 6. బాండీలో నూనె వేసుకొని కాచుకోవాలి .
 7. కాగిన నూనెలో పూరీలు వరుసగా వేయించుకోవాలి .
 8. పూరీలు వరుసగా వేయించుకున్నాకా తీసివేయగానే వాటిమీద పంచదార పొడి జల్లుకోవాలి .
 9. అంతే పొరలు విడిన కరకరలాడే తియ్యని చిరోటి తినటానికి రెడీ

Reviews for Chiroti Recipe in Telugu (1)

Seetha Sadhu9 months ago

Wow
జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo