బొబ్బట్టు (భక్ష్యాలు) పండుగ సమయాల్లో వండుకునే పిండి వంటకం తెలుగ వారు ఇష్టపడి తినే తీపి వంటకం | Bobbatlu Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  11th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bobbatlu recipe in Telugu,బొబ్బట్టు (భక్ష్యాలు) పండుగ సమయాల్లో వండుకునే పిండి వంటకం తెలుగ వారు ఇష్టపడి తినే తీపి వంటకం, Ganiprameela Ganiprameela
బొబ్బట్టు (భక్ష్యాలు) పండుగ సమయాల్లో వండుకునే పిండి వంటకం తెలుగ వారు ఇష్టపడి తినే తీపి వంటకంby Ganiprameela Ganiprameela
 • తయారీకి సమయం

  40

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  7

  జనం

2

0

బొబ్బట్టు (భక్ష్యాలు) పండుగ సమయాల్లో వండుకునే పిండి వంటకం తెలుగ వారు ఇష్టపడి తినే తీపి వంటకం వంటకం

బొబ్బట్టు (భక్ష్యాలు) పండుగ సమయాల్లో వండుకునే పిండి వంటకం తెలుగ వారు ఇష్టపడి తినే తీపి వంటకం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bobbatlu Recipe in Telugu )

 • మైదాపిండి 125 gms
 • గోదుమపిండి 125 gms
 • బెల్లం 250 gms (1/2kg)
 • ఇలాచీలు 3
 • నెయ్యి 50gms
 • చెనగ పప్పు 250 gms

బొబ్బట్టు (భక్ష్యాలు) పండుగ సమయాల్లో వండుకునే పిండి వంటకం తెలుగ వారు ఇష్టపడి తినే తీపి వంటకం | How to make Bobbatlu Recipe in Telugu

 1. ముందుగా చెనగపప్పు రెండు సార్లు కడిగి తగినన్ని నీళ్ళు వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి
 2. తరువాత పప్పులో నీళ్ళుంటే తీసేయాలి బెల్లం వేసి స్టవ్ పైన పెట్టి ఉడికించాలి
 3. పప్పు ఉడికేలోపు పిండి కలిపి పెట్టుకోవాలి పిండిలో నెయ్యి వేడి చేసి వేయాలి
 4. తరువాత ఇలా ముద్దలాగ కల్పుకోవాలి
 5. బెల్లం పప్పులో బాగ ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారపెట్టాలి
 6. చల్లారినాక ఇలాచీలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి
 7. ఇప్పుడు అరచేతికి కొద్దగా నెయ్యి అద్దుకుని పూరీకి తీసుకున్నంత పిండి తీసుకుని వెడల్పుగా వొత్తుకుని అందులో పూర్ణం పెట్టి పిండి తో మూసేయాలి
 8. ఇలా దీనిని ఒక కవర్ పైన పెట్టి వొత్తుకోవాలి
 9. ఇలా వొత్తుకున్న తరువాత స్టవ్ పైన పెనం పెట్టి నెయ్యి వేసి దోరగా కాల్చాలి
 10. అంతే బొబ్బట్లు రెడీ

Reviews for Bobbatlu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo