స్వీట్ పొటాటో మిల్క్ పౌడర్ జామున్ | Sweet potato milk powder Jamun Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  14th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sweet potato milk powder Jamun recipe in Telugu,స్వీట్ పొటాటో మిల్క్ పౌడర్ జామున్, Indira Bhaskar
స్వీట్ పొటాటో మిల్క్ పౌడర్ జామున్by Indira Bhaskar
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

స్వీట్ పొటాటో మిల్క్ పౌడర్ జామున్ వంటకం

స్వీట్ పొటాటో మిల్క్ పౌడర్ జామున్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet potato milk powder Jamun Recipe in Telugu )

 • చిలకడదుంప 1
 • మిల్క్ పౌడర్ అర కప్పు
 • మైదా రెండు టేబుల్ స్పూన్లు
 • పెరుగు రెండు చెంచాలు
 • బేకింగ్ పౌడర్ పావు చెంచా
 • ఇలాచి పౌడర్ పావు చెంచా
 • పంచదార ఒక కప్పు
 • నీళ్లు తగినన్ని
 • నూనె-వేయించడానికి సరిపడా

స్వీట్ పొటాటో మిల్క్ పౌడర్ జామున్ | How to make Sweet potato milk powder Jamun Recipe in Telugu

 1. ముందుగా చిలకడ దుంపలు ఉడకపెట్టి మెత్తగా ముద్దగా చేసుకోవాలి.
 2. ఇప్పుడు అందులో పాలపొడి మైదా బేకింగ్ పౌడర్ ఇలాచి పౌడర్ పెరుగు అన్నీ వేసి మెత్తగా మృదువుగా ఉండేలా కలుపుకోవాలి.
 3. అన్ని కలపాలి
 4. అసరమైతే ఇందులో కొద్దిగా నీరు పోసుకుని మెత్తటి చపాతీపిండిలా కలపాలి.
 5. దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి.
 6. ఈలోగా ఒక గిన్నెలో పంచదార వేసి చిన్న కప్పు నీళ్లు పోసి బుడగల వచ్చేవరకు ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
 7. దీనికి మాముల పాకం సరిపోతుంది తీగపాకం రానక్కరలేదు.
 8. ఇప్పుడు ఒక ముఖంలో నూనె వేసి మరిగాక పైన చేసుకున్న జామున్ ఉండల్ని వేసి చిన్న మంట మీద ఎర్రగా వేయించాలి.
 9. ఇప్పుడు వీటిని వేడివేడి పాకంలో వేసుకోవాలి.
 10. ఎంతో మెత్తగా ఉండే స్వీట్ పొటాటో మిల్క్ పౌడర్ జామున్ రెడీ.

నా చిట్కా:

ఇవి చేసుకునేటప్పుడు మనం చేసిన పిండి చాలా మృదువుగా రావాలి.

Reviews for Sweet potato milk powder Jamun Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo