కోవా కజ్జికాయ | Kova kajjikaya Recipe in Telugu

ద్వారా Lakshmi Leelavathi  |  14th Jul 2018  |  
1 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Kova kajjikaya recipe in Telugu,కోవా కజ్జికాయ, Lakshmi Leelavathi
కోవా కజ్జికాయby Lakshmi Leelavathi
 • తయారీకి సమయం

  2

  గంటలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

3

1

కోవా కజ్జికాయ వంటకం

కోవా కజ్జికాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kova kajjikaya Recipe in Telugu )

 • పాలు 1 లీటర్
 • బెల్లం 50g
 • పంచదార 1/2కప్పు
 • నెయ్యి 6 టేబుల్ స్పూన్స్
 • కొబ్బరికాయ 1
 • యాలుకలు 6
 • జీడిపప్పు 50 g

కోవా కజ్జికాయ | How to make Kova kajjikaya Recipe in Telugu

 1. ముందుగా కోవా తయారు చేసుకోవాలి.
 2. ఒక కడై తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో ఒక లీటరు పాలు పోయ్యాలి.
 3. తర్వాత పాలుమరిగి సగం అయ్యేవరకు మరిగించాలి.ఒక పొడవాటి గరిట తీసుకుని కలుపుతూనే ఉండాలి.
 4. తర్వాత పాలు మరిగి సగం అయ్యిన తర్వాత అందులో ఒక కప్పు లేక అర కప్పు పంచదార చూసుకుని వేసుకోవాలి.ఎక్కువ తీపి ఉన్న బాగోదు.కాబట్టి తీపి చూసుకుని పంచదార కలుపుకోవాలి.
 5. తర్వాత కలుపుతూనే ఉండాలి పాలు దగ్గరకు వచ్చేవరకు కలుపుతూనే ఉండాలి.
 6. చివర్లో 3 యాలుకలు తీసుకుని అందులో గింజలు మాత్రమే తీసుకునివాటిని పొడి చేసుకుని కలపాలి.3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కలపాలి.
 7. గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి.తర్వాత ఒక ప్లేట్ తీసుకుని నెయ్యి రాసి కోవాని ప్లేటులో పరుచుకోవాలి.
 8. తర్వాత కొబ్బరి లౌజు తయారుచేసుకోవాలి.
 9. ముందుగా పాన్లో బెల్లం 50g కొంచెం వాటర్ వేసి కలుపుతూ ఉండాలి.
 10. లేత పాకం వచ్చేవరకు కలుపుతూ ఉండాలి తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకుని ముక్కలుగా చేసుకుని మిక్సీ వేసుకుని కొబ్బరి యాడ్ చేసుకోవాలి.
 11. కొబ్బరి లౌజు గట్టిపడేవారకు తిప్పుతూనే ఉండాలి .
 12. యాలుకలు పొడిచేసుకొని కలుపుకోవాలి.
 13. తర్వాత చల్లగా అయ్యేవరకు పక్కన పెట్టుకోవాలి.
 14. చల్లగా అయ్యిన తర్వాత కోవా తీసుకొని,కొంచెం నెయ్యి చేతికి రాసుకుని కోవా అరచేతి లో తీసుకుని ఒక బిళ్లాల వత్తుకుని అందులో కొబ్బరి ఉండ చేసుకుని మధ్యలో పెట్టి గుండ్రని లడ్డులా తయారుచేసుకోవాలి.
 15. పైన సన్నగా తరిగిన జీడిపప్పు అద్దు కోవాలి.
 16. అంతే చాలా రుచిగా వుండే కోవా కజ్జికాయ సిద్ధం అయ్యింది.

నా చిట్కా:

కోవపలుచగా ఉంటే కొంచెం మైదా అద్ద్ చేసుకోవచ్చు.

Reviews for Kova kajjikaya Recipe in Telugu (1)

Tejaswi Yalamanchi4 months ago

జవాబు వ్రాయండి