మ్యాంగో సాగో పోమెలో డెసర్ట్ | Mango Sago Pomelo Dessert Recipe in Telugu

ద్వారా Sushma Subramanyam  |  15th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mango Sago Pomelo Dessert recipe in Telugu,మ్యాంగో సాగో పోమెలో డెసర్ట్, Sushma Subramanyam
మ్యాంగో సాగో పోమెలో డెసర్ట్by Sushma Subramanyam
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

మ్యాంగో సాగో పోమెలో డెసర్ట్ వంటకం

మ్యాంగో సాగో పోమెలో డెసర్ట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango Sago Pomelo Dessert Recipe in Telugu )

 • కొబ్బరి పాలు 1 కప్పు
 • ఎవాపరేటెడ్ పాలు 1 కప్పు
 • పాలు 1/2 కప్పు
 • ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం 2 టేబుల్ స్పూన్లు
 • చిక్కని మామిడిపండు రసం 1 కప్పు
 • పంచదార 1/2 కప్పు
 • పంపర పనాస కుసుమలు 2 టేబుల్ స్పూన్లు
 • మామిడిపండు ముక్కలు 1/2 కప్పు

మ్యాంగో సాగో పోమెలో డెసర్ట్ | How to make Mango Sago Pomelo Dessert Recipe in Telugu

 1. పాలకు పంచదార కలిపి మరిగించి పెట్టుకోవాలి
 2. మరిగించిన పాలని చల్లార్చుకోవాలి
 3. కొబ్బరిపాలతో పాలు, ఎవాపరేటెడ్ పాలు, మామిడిపండు రసం కలిపి మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి
 4. ఇందులో ఉడికించిన సగ్గుబియ్యం, మామిడిపండు ముక్కలు, పంపర పనాస కుసుమలు వేసి కలపాలి
 5. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్ లో 2-3 గంటల పాటు చల్లబరుచుకోవాలి, ఆ తర్వాత సర్వ్ చేయాలి

నా చిట్కా:

మామిడి పండు ముక్కలని విడిగా చల్లబరచి కలిపితే నల్లబడకుండా ఉంటాయి

Reviews for Mango Sago Pomelo Dessert Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo