ఎగ్ లెస్ చాక్లెట్ డోనట్స్ | Eggless chocolate donuts Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  16th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Eggless chocolate donuts recipe in Telugu,ఎగ్ లెస్ చాక్లెట్ డోనట్స్, Indira Bhaskar
ఎగ్ లెస్ చాక్లెట్ డోనట్స్by Indira Bhaskar
 • తయారీకి సమయం

  2

  గంటలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

2

0

ఎగ్ లెస్ చాక్లెట్ డోనట్స్ వంటకం

ఎగ్ లెస్ చాక్లెట్ డోనట్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Eggless chocolate donuts Recipe in Telugu )

 • పాలు పావుకప్పు
 • పంచదార పావు టీ స్పూను
 • డ్రై ఈస్ట్ 1 టీ స్పూను
 • బేకింగ్ పౌడర్ పావు టీస్పూను
 • మైదా పిండి ఒక కప్పు
 • వెన్న రెండు టేబుల్ స్పూన్లు
 • నీళ్లు కొద్దిగా
 • ఉప్పు రెండు చిటికెలు
 • నూనె డీప్ ఫ్రైకి సరిపడా
 • చాక్లెట్ సిరప్ అరకప్పు

ఎగ్ లెస్ చాక్లెట్ డోనట్స్ | How to make Eggless chocolate donuts Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నెలో కి పాలు గోరువెచ్చగా చేసి పోసుకోవాలి.
 2. ఇప్పుడు ఈ పాలల్లో పంచదార , డ్రై ఈస్ట్ వేసి కలిపి ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
 3. ఇప్పుడు ఇందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్ , వెన్న,ఉప్పు వేసి కలిపి మధ్యలో కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
 4. దీనిని రౌండ్ గా ముద్దలా చేసి పైన కొద్దిగా నూనె వేసి ఒక్క పలుచని వస్త్రంతో కప్పి రెండు గంటలపాటు పక్కన ఉంచాలి.
 5. రెండు గంటలు అయిన తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా వత్తుకుని ఒక రౌండ్ మోతతో గుండ్రంగా ముక్కలుగా కొయ్యాలి.
 6. ఇప్పుడు వీటికి మధ్యలో మరొక చిన్న మూత ఏదైనా తీసుకుని చిన్న రంధ్రం చేసి గారెలు మాదిరిగా చేసుకోవాలి.
 7. వీటిని ఒక పావుగంట సేపు పక్కన ఉంచాలి.
 8. ఈలోగా ఒక మూకుట్లో నూనె వేసి మరిగాక పైన చేసుకున్న donuts ని నూనెలో చిన్నమంటమీద ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి.
 9. ఇప్పుడు ఈ చేసుకున్న donuts ని కొద్దిగా చల్లారాక చాక్లెట్ సిరప్ తీసుకుని దాంట్లో ముంచాలి.
 10. మనకు నచ్చిన విధంగా చాక్లెట్స్ సిరప్ తో మొత్తం అన్ని డోనట్స్ని అలంకరించుకుని సర్వ్ చేస్తే మెత్తగా ఉండే donuts ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ‌.

Reviews for Eggless chocolate donuts Recipe in Telugu (0)