హోమ్ / వంటకాలు / బీట్రూట్ సేమియా కేసరి.

Photo of Beetroot semiya kesari by Chandrika Marripudi at BetterButter
631
3
0.0(0)
0

బీట్రూట్ సేమియా కేసరి.

Jul-17-2018
Chandrika Marripudi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ సేమియా కేసరి. రెసిపీ గురించి

మామూలుగా చేసుకునే సేమ్యా కేసరికి బీట్రూట్ తురుము వేసి చేసిన తీపి వంటకం ఇది.కృత్రిమ రంగులు వాడకుండా ఇలా సహజమైన బీట్రూట్ రంగు చూడటానికి బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది.మొదటి సారి చేశాను. మా ఇంట్లో అంతా ఇష్టపడ్డారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 5

  1. బీట్రూట్:1పెద్దది(తురుముకోవాలి)
  2. సేమ్యా:200గ్రా
  3. పంచదార:150గ్రా
  4. యాలకుల పొడి:1/2టీ స్పూన్
  5. నెయ్యి:4టేబుల్ స్పూన్లు.
  6. జీడిపప్పు:కొద్దిగా.
  7. పాలు:2కప్పులు.

సూచనలు

  1. బాణలిలో ఒక స్పూన్ నెయ్యి వేడి చేసుకుని సేమ్యా వేసి వేయించి తీసి పెట్టుకోవాలి.
  2. మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసి బీట్రూట్ తురుము వేసి వేయించాలి.
  3. బీట్రూట్ బాగా వేగాక,వేయించిన సేమ్యా వేసి కలపాలి.
  4. ఇపుడు దాన్లో పాలు పోసి ఉడికించాలి.
  5. ఇపుడు పంచదార కూడా వేసి కలుపుతూ ఉడికించాలి.
  6. సేమ్యా ఉడికి దగ్గర పడ్డాక యాలకులపొడి,వేయించిన జీడిపప్పు, ఒక స్పూన్ నెయ్యి వేసి కలపాలి.
  7. చక్కటి రుచికరమైన బీట్రూట్ సేమ్యా కేసరి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర