బ్రెడ్ రసమలై | Bread rasamalai Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  17th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bread rasamalai recipe in Telugu,బ్రెడ్ రసమలై, Indira Bhaskar
బ్రెడ్ రసమలైby Indira Bhaskar
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

బ్రెడ్ రసమలై వంటకం

బ్రెడ్ రసమలై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread rasamalai Recipe in Telugu )

 • పాలు అర లీటరు
 • పంచదార అర కప్పు
 • మిల్క్ మెయిడ్ 5 చెంచాలు
 • మిల్క్ పౌడర్ 3 చెంచాలు
 • ఇలాచి పౌడర్ 1/4 స్పూన్
 • బాదం, జీడిపప్పు ముక్కలు 2 స్పూన్లు
 • బ్రెడ్ ముక్కలు 8
 • కుంకుమపువ్వు చిటికెడు

బ్రెడ్ రసమలై | How to make Bread rasamalai Recipe in Telugu

 1. ముందుగా ఒక మందపాటి మూకుట్లో పాలు పోసి బాగా మరిగించాలి.
 2. పాలు మరిగాక అందులో పంచదార వేసి చిన్న మంటమీద ఉడికించాలి.
 3. ఇప్పుడు అందులో కండెన్స్డ్ మిల్క్ లేదా మిల్క్ మెయిడ్ వేసి బాగా కలపాలి.
 4. ఇప్పుడు అందులో మిల్క్ పౌడర్, కుంకుమపువ్వు, ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా కలపాలి
 5. చిన్న మంటపై ఉంచి పాలు అన్ని దగ్గరపడ్డాక అంచులకు అంటుకొనే వరకు ఉంచి తీసుకుంటే రభరి రెడీ.
 6. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను ఒక మూతో గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది.
 7. ఈ బ్రెడ్ ముక్కలను పైన చేసుకున్న రభరి లో బాగా మంచి పక్కన పెట్టాలి.
 8. ఇప్పుడు పైన చేసుకున్న రభరి ఒక బౌల్లో వేసి బ్రెడ్ ముక్కలను వేసి పైన బాదం జీడిపప్పు ముక్కలతో అలంకరించుకుంటే బ్రెడ్ రసమలై రెడీ.

నా చిట్కా:

రభరి ముందుగా చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు కానీ బెడ్ ముక్కలు తినే ముందు రభరి లో వేసుకోవాలి.

Reviews for Bread rasamalai Recipe in Telugu (0)