చాకో కప్ కేక్ | Choco cup cake Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  17th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Choco cup cake recipe in Telugu,చాకో కప్ కేక్, Sree Vaishnavi
చాకో కప్ కేక్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    23

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

చాకో కప్ కేక్ వంటకం

చాకో కప్ కేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Choco cup cake Recipe in Telugu )

  • 1 1/4 కప్ మైదా పిండి
  • బేకింగ్ సోడా 1/4 చెంచా
  • కోకో పౌడర్ 6 చెంచాలు
  • ఉప్పు చిటికెడు
  • వేడి నీళ్లు 1 చెంచా
  • ఇన్స్టెంట్ కాఫీ పొడి 1 చెంచా
  • ఉప్పు లేని బట్టర్ 4 చెంచాలు
  • పంచదార 1 కప్
  • కనోలా ఆయిల్ 1/4 కప్
  • మజ్జిగ 1/4 కప్
  • వెనిల్లా ఎసెన్స్ 1 చెంచా

చాకో కప్ కేక్ | How to make Choco cup cake Recipe in Telugu

  1. ముందుగా ఒవేన్ ని 350 డిగ్రీ దగ్గర ప్రీ హీట్ చేసుకోవాలి
  2. ఒక పెద్ద గిన్నె లో మైదా పిండి బేకింగ్ సోడా కోకో పౌడర్ ఉప్పు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. ఇప్పుడు వేడి నీళ్లు కాఫీ వేసి కాఫీ కరిగేవరకు ఉంచాలి
  4. ఇప్పుడు అందులో వెన్న పంచదార వేసి క్రీమ్ ల చేసుకోవాలి
  5. అవి బాగా కలిసాక అందులో నూనె మజ్జిగ వెనిల్లా కాఫీ మిశ్రమం వేసి బాగా కలపాలి
  6. అది కలిసాక అందులో మైదా పిండి మిశ్రమం వేసి బాగా కలపాలి
  7. ఆ పిండి ని భాగాలుగా తీసుకొని కప్ కేక్ మౌల్డ్ లో వేసుకొని ఒవేన్ లో 20-23 నిమిషాలు ఉంచాలి
  8. అది అయ్యిన తరువాత కాసేపు చల్లగా అవ్వనివాలి తరువాత సేవ్ చేసుకోవడమే

నా చిట్కా:

కప్ కేక్ అయ్యిన అప్పుడు దాంట్లో టూత్ పిక్ తో గుచ్చి చూస్తే దానికి ఏమి అంటుకోకపోతే కప్ కేక్ రెడీ

Reviews for Choco cup cake Recipe in Telugu (0)