హోమ్ / వంటకాలు / కివీ కరాచి హల్వా

Photo of Kiwi karachi halwa by Indira Bhaskar at BetterButter
345
2
0.0(0)
0

కివీ కరాచి హల్వా

Jul-23-2018
Indira Bhaskar
2 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కివీ కరాచి హల్వా రెసిపీ గురించి

ఇది తియ్య తియ్యగా పుల్ల పుల్లగా ఉండే ‌పౌష్టికమైన హల్వా.రకరకాల వంటలు తినాలి అనుకున్న వాళ్ళు ఇది తప్పకుండా చేసుకు తినాల్సిందే.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కివీ పండు 1 లేదా 2
  2. కరాచి 1 కప్పు
  3. పంచదార 1 కప్పు
  4. నెయ్యి 1/4 కప్పు
  5. బాదం పప్పు 6
  6. కిస్మిస్ 15
  7. యాలకుల పొడి 1/4 చెంచా

సూచనలు

  1. కివీ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.ముందుగా ఒక బాండీ లోనెయ్యి వేసి కాగాక జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో కరాచి నూక వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి.
  3. ఇప్పుడు నూక వేగాక పైన కట్ చేసి ఉంచుకున్న కివి ముక్కల గుజ్జుని కూడా వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి.
  4. ఇప్పుడు అందులో ఒక్క కప్పుడు నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ దీనిని ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి.
  5. ఇప్పుడు అందులో ఒక కప్పు పంచదార వేసి బాగా కరిగేవరకు కలుపుతూ ఉడకనివ్వాలి.
  6. ఇప్పుడు పైన రెండు చెంచాల నెయ్యి వేసి కలిపి అందులో బాదం పప్పు, కిస్మిస్, యాలకుల పొడి వేసి కలిపి పైన బాదంపప్పు కిస్మిస్ ముక్కలతో అలంకరించి సర్వ్ చేస్తే కివీ హల్వా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర