హోమ్ / వంటకాలు / కొబ్బరి పొంగలి

Photo of Coconut pongal by Indira Bhaskar at BetterButter
560
1
0.0(0)
0

కొబ్బరి పొంగలి

Jul-23-2018
Indira Bhaskar
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి పొంగలి రెసిపీ గురించి

కొబ్బరి తో చేసే ఒక సాంప్రదాయంక వంటకం.పండగల్లో ఈ కొబ్బరి పొంగలిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • భారతీయ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కొబ్బరి పాలు 2 కప్పులు
  2. బియ్యం 1 కప్పు
  3. పెసరపప్పు 1/4 కప్పు
  4. బెల్లం తురుము 1 కప్పు
  5. నెయ్యి 5 చెంచాలు
  6. పచ్చకర్పూరం చిటికెడు
  7. జీడిపప్పు 10
  8. కిస్మిస్ 15
  9. యాలకుల పొడి 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా పెసరపప్పును దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు కొబ్బరిని మిక్సీలో వేసి కొబ్బరిపాలు తయారుచేసుకోవాలి.
  3. ఇప్పుడు బియ్యం పెసరపప్పు కప్పున్నర కొబ్బరి పాలు ,తగినన్ని నీళ్లు కలిపి ప్రెజర్ కుక్కర్లో పెట్టి పొడిపొడిగా ఉండేలా ఉడికించుకోవాలి.
  4. ఇప్పుడు బెల్లం తురుముకుని బాండీలో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి పాకం వచ్చేవరకు పాకం పట్టాలి.
  5. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో పైన ఉడికించిన పప్పు అన్నాన్ని వేసి, 3 చెంచాల నెయ్యి వేసి కలుపుతూ ఉడకనివ్వాలి.
  6. ఇందులో చిటికెడు పచ్చకర్పూరం, యాలకుల పొడి కూడా వేసి ఉడకనివ్వాలి.
  7. ఇప్పుడు ఒక బాండీలో రెండు చెంచాలు నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేయించుకోవాలి.
  8. ఇప్పుడు కిస్మిస్ జీడిపప్పులను పై మిశ్రమంలో వేసి వేడివేడిగా నెయ్యితో సర్వ్ చేసుకుంటే కొబ్బరి పొంగలి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర