జర్ధా అరబిక్ స్వీట్ రైస్ (కేసర్ పులావ్) | Zarda rice (kesar pulav) Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  23rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Zarda rice (kesar pulav) recipe in Telugu,జర్ధా అరబిక్ స్వీట్ రైస్ (కేసర్ పులావ్), Indira Bhaskar
జర్ధా అరబిక్ స్వీట్ రైస్ (కేసర్ పులావ్)by Indira Bhaskar
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

జర్ధా అరబిక్ స్వీట్ రైస్ (కేసర్ పులావ్) వంటకం

జర్ధా అరబిక్ స్వీట్ రైస్ (కేసర్ పులావ్) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Zarda rice (kesar pulav) Recipe in Telugu )

 • బాస్మతి బియ్యం ఒక కప్పు
 • పంచదార ఒక కప్పు
 • లవంగాలు 6
 • ఇలాచి 4
 • ఉప్పు పావు స్పూను
 • నెయ్యి 5 చెంచాలు
 • కుంకుమపువ్వు చిటికెడు
 • కేసరి రంగు చిటికెడు
 • జీడిపప్పు 10
 • కిస్మిస్ 20
 • బాదం పప్పులు 5
 • మరి తురుము కొద్దిగా

జర్ధా అరబిక్ స్వీట్ రైస్ (కేసర్ పులావ్) | How to make Zarda rice (kesar pulav) Recipe in Telugu

 1. ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి రెండు కప్పుల నీళ్ళు పోసి ఒక అరగంటసేపు నానబెట్టాలి.
 2. ఇప్పుడు ఒక మందపాటి మూకుట్లో నెయ్యి వేసి వేడెక్కాక లవంగాలు యాలక్కాయలు వేసి వేగనివ్వాలి.
 3. ఇప్పుడు అందులో బాస్మతి బియ్యాన్ని నాన పెట్టిన రెండు కప్పుల నీళ్ళు , ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి.
 4. అందులో బియ్యాన్ని వేసి మూతపెట్టి చిన్నమంటమీద ఉడకనివ్వాలి. కుంకుమపువ్వు కూడా వెయ్యాలి.
 5. అన్నం బాగా ఉడికాక అందులో పంచదార వేసి బాగా కలిపి కేసరి రంగు కూడా వేసి అంతా బాగా ఉడికేవరకు మూతపెట్టి ఉంచాలి.
 6. పంచదార కరిగి లేత పాకం వచ్చి అంతా గట్టిపడేవరకు మూతపెట్టి ఉంచాలి.
 7. ఇప్పుడు పైన కొంచెం నెయ్యి వేసి నెయ్యి లో వేయించిన జీడిపప్పు కిస్మిస్ బాదంపప్పు లతో అలంకరించుకుంటే కేసరి పులావ్ రెడీ.
 8. పైన కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు.

నా చిట్కా:

బాస్మతి బియ్యాన్ని బదులు మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు.

Reviews for Zarda rice (kesar pulav) Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo