BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / జర్ధా అరబిక్ స్వీట్ రైస్ (కేసర్ పులావ్)

Photo of Zarda rice (kesar pulav) by Indira Bhaskar at BetterButter
0
0
0(0)
0

జర్ధా అరబిక్ స్వీట్ రైస్ (కేసర్ పులావ్)

Jul-23-2018
Indira Bhaskar
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జర్ధా అరబిక్ స్వీట్ రైస్ (కేసర్ పులావ్) రెసిపీ గురించి

మనం ఎప్పుడూ చేసుకునే పొంగల్ కి కొంచెం ఇది భిన్నంగా చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా వెరైటీగా చేసిపెడితే బావుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • ఇరానియన్
  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. బాస్మతి బియ్యం ఒక కప్పు
  2. పంచదార ఒక కప్పు
  3. లవంగాలు 6
  4. ఇలాచి 4
  5. ఉప్పు పావు స్పూను
  6. నెయ్యి 5 చెంచాలు
  7. కుంకుమపువ్వు చిటికెడు
  8. కేసరి రంగు చిటికెడు
  9. జీడిపప్పు 10
  10. కిస్మిస్ 20
  11. బాదం పప్పులు 5
  12. మరి తురుము కొద్దిగా

సూచనలు

  1. ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి రెండు కప్పుల నీళ్ళు పోసి ఒక అరగంటసేపు నానబెట్టాలి.
  2. ఇప్పుడు ఒక మందపాటి మూకుట్లో నెయ్యి వేసి వేడెక్కాక లవంగాలు యాలక్కాయలు వేసి వేగనివ్వాలి.
  3. ఇప్పుడు అందులో బాస్మతి బియ్యాన్ని నాన పెట్టిన రెండు కప్పుల నీళ్ళు , ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి.
  4. అందులో బియ్యాన్ని వేసి మూతపెట్టి చిన్నమంటమీద ఉడకనివ్వాలి. కుంకుమపువ్వు కూడా వెయ్యాలి.
  5. అన్నం బాగా ఉడికాక అందులో పంచదార వేసి బాగా కలిపి కేసరి రంగు కూడా వేసి అంతా బాగా ఉడికేవరకు మూతపెట్టి ఉంచాలి.
  6. పంచదార కరిగి లేత పాకం వచ్చి అంతా గట్టిపడేవరకు మూతపెట్టి ఉంచాలి.
  7. ఇప్పుడు పైన కొంచెం నెయ్యి వేసి నెయ్యి లో వేయించిన జీడిపప్పు కిస్మిస్ బాదంపప్పు లతో అలంకరించుకుంటే కేసరి పులావ్ రెడీ.
  8. పైన కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర