పొంగలి | Sweet pongali Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  23rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sweet pongali recipe in Telugu,పొంగలి, Chandrika Marripudi
పొంగలిby Chandrika Marripudi
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

పొంగలి వంటకం

పొంగలి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet pongali Recipe in Telugu )

 • బియ్యం:2కప్పులు
 • సగ్గుబియ్యం:1/2కప్
 • పచ్చి శనగపప్పు:2 టేబుల్ స్పూన్లు
 • బెల్లం:1 1/2 కప్
 • యాలకుల పొడి: 1/2 స్పూన్
 • నెయ్యి:3టేబుల్ స్పూన్లు
 • పాలు:1/2 లీ
 • నీళ్లు:1/2 లీ

పొంగలి | How to make Sweet pongali Recipe in Telugu

 1. ముందుగా బియ్యం, సగ్గుబియ్యం, పచ్చి శనగపప్పు కలిపి నీళ్లు పోసి కడిగి పెట్టుకోవాలి.
 2. ఒక మందపాటి గిన్నె స్టవ్ పైన పెట్టి నీళ్లు ,కొద్దిగా పాలు పోసి మరిగించాలి.
 3. మరిగాక అందులో బియ్యం మిశ్రమం వేసి ఉడికించాలి.
 4. బాగా మెత్తగా ఉడికాక బెల్లం తురుము వేసి కలపాలి
 5. బెల్లం అంతా కరిగి అంతా కలిసేలా కలుపుకోవాలి.
 6. ఇపుడు యాలకుల పొడి వేసి కలిపి మిగిలిన పాలు పోసి కలిపుకుని చివరగా నెయ్యి వేసి కలిపి దించుకోవాలి.
 7. జీడిపప్పు, కిస్మిస్ నెయ్యి లో వేయించి వేసుకుంటే ఇంకా బాగుంటుంది.

నా చిట్కా:

పచ్చి శనగపప్పు బదులుగా పెసరపప్పు వేసుకోవచ్చు.

Reviews for Sweet pongali Recipe in Telugu (0)