హోమ్ / వంటకాలు / పొంగలి

Photo of Sweet pongali by Chandrika Marripudi at BetterButter
96
0
0.0(0)
0

పొంగలి

Jul-23-2018
Chandrika Marripudi
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొంగలి రెసిపీ గురించి

బియ్యం, బెల్లంతో చేసుకునే తీపి వంటకం ఇది.సాథారణంగా పండుగలు ,శుభకార్యాలకు అందరూ చేసుకునే దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే సాంప్రదాయ వంటకం ఇది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం:2కప్పులు
  2. సగ్గుబియ్యం:1/2కప్
  3. పచ్చి శనగపప్పు:2 టేబుల్ స్పూన్లు
  4. బెల్లం:1 1/2 కప్
  5. యాలకుల పొడి: 1/2 స్పూన్
  6. నెయ్యి:3టేబుల్ స్పూన్లు
  7. పాలు:1/2 లీ
  8. నీళ్లు:1/2 లీ

సూచనలు

  1. ముందుగా బియ్యం, సగ్గుబియ్యం, పచ్చి శనగపప్పు కలిపి నీళ్లు పోసి కడిగి పెట్టుకోవాలి.
  2. ఒక మందపాటి గిన్నె స్టవ్ పైన పెట్టి నీళ్లు ,కొద్దిగా పాలు పోసి మరిగించాలి.
  3. మరిగాక అందులో బియ్యం మిశ్రమం వేసి ఉడికించాలి.
  4. బాగా మెత్తగా ఉడికాక బెల్లం తురుము వేసి కలపాలి
  5. బెల్లం అంతా కరిగి అంతా కలిసేలా కలుపుకోవాలి.
  6. ఇపుడు యాలకుల పొడి వేసి కలిపి మిగిలిన పాలు పోసి కలిపుకుని చివరగా నెయ్యి వేసి కలిపి దించుకోవాలి.
  7. జీడిపప్పు, కిస్మిస్ నెయ్యి లో వేయించి వేసుకుంటే ఇంకా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర