హోమ్ / వంటకాలు / గుమ్మడివడియాలు తోటకూర పులుసు

Photo of Ash pampkin fryums amaranths pulusu by మనస్విని శెట్టి at BetterButter
1119
4
0.0(0)
0

గుమ్మడివడియాలు తోటకూర పులుసు

Aug-09-2018
మనస్విని శెట్టి
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుమ్మడివడియాలు తోటకూర పులుసు రెసిపీ గురించి

గుమ్మడివడియాలు మరియు తోటకూర తో కలిపి చేసిన పులుసు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. గుమ్మడివడియాలు అరకప్పు
  2. తోటకూర ఒక కప్పు
  3. చింతపండు పులుసు ఒక కప్పు
  4. బెల్లం తురుము రెండు స్పూన్లు
  5. ఆవాలు ఒక స్పూన్
  6. మెంతులు ఒక స్పూన్
  7. జీలకర్ర ఒక స్పూన్
  8. కరివేపాకు ఒక రెమ్మ
  9. కారం రెండు స్పూన్లు
  10. ఉప్పు రుచికి సరిపడా
  11. పసుపు చిటికెడు
  12. ఎండుమిర్చి 4
  13. పచ్చిమిర్చి 6
  14. ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
  15. నూనె రెండు స్పూన్లు
  16. అల్లంవెల్లుల్లి ముద్ద ఒక స్పూన్

సూచనలు

  1. ముందుగా పాన్ పెట్టి నూనె వేయాలి
  2. నూనె వేడెక్కిన తరువాత గుమ్మడి వడియాలు వేయించాలి
  3. దోరగా వేగిన వడియాలు ఒక ప్లేట్లో పక్కకి తీసి పెట్టుకోవాలి
  4. ఇప్పుడు మళ్ళీ పాన్ లో నూనె వేసి వేడిచేయాలి
  5. నూనెలో ఎండుమిర్చి,ఆవాలు ,జీలకర్ర,కరివేపాకు, మెంతులు వేసి వేయించాలి
  6. తరువాత ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి వేయాలి
  7. ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి బాగా మగ్గించాలి
  8. ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి మగ్గుతుండగా ఉప్పు,కారం ,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలుపుకోవాలి
  9. ఇప్పుడు కోసిపెట్టుకున్న తోటకూర వేసి బాగా మగ్గించాలి
  10. తోటకూర కూడా మగ్గిన తరువాత చింతపండు పులుసు వేయాలి
  11. చింతపండు పులుసు వేసాకా బాగా మరిగించాలి
  12. చింతపండు పులుసు మరుగుతున్నపుడు బెల్లం, గుమ్మడి వడియాలు వేసుకోవాలి
  13. ఇలా ఒక 5 నిమిషాలు మరిగించాలి
  14. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి దించుకుంటే పులుసు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర