హోమ్ / వంటకాలు / పప్పు గంగపాయల ఆకు కూర

Photo of DAL PARSELENA LEAF CURRY by Ram Ram at BetterButter
512
4
0.0(0)
0

పప్పు గంగపాయల ఆకు కూర

Aug-09-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పు గంగపాయల ఆకు కూర రెసిపీ గురించి

ఈ కూర చాలా ఆరోగ్య కరం..ఈ ఆకు కొరకు కాన్సర్ తో పోరాడే గుణం ఉంది,కిడ్నీలో రాళ్లు ఉన్న వారు ఇది తినకూడదు.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కందిపప్పు ఒక చిన్న కప్పు
  2. గంగపాయల ఆకు 2 గుప్పెట్లు
  3. టమాటో 1
  4. చింతపండు చిన్న ముక్క
  5. ఆవాలు 1/4స్పూన్
  6. జీలకర్ర 1/4స్పూన్
  7. మినపగుళ్లు 1/4స్పూన్
  8. కరివేపాకు కొద్దిగా
  9. వెల్లులి ముక్కలు 1స్పూన్
  10. పచ్చిమిర్చి 2
  11. ఎండుమిర్చి 2
  12. పసుపు కొద్దిగా
  13. ఉప్పు సరిపడా
  14. నూనె 4స్పూన్లు

సూచనలు

  1. ముందుగా ఆకులను తుంచుకోవాలి లేతగా ఉంటే వాటి కాడలు కూడా ముక్కలుగా చేసి వేసుకోవచ్చు..
  2. ఆకును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి..
  3. ఇప్పుడు కంది పప్పుని ఉడికించి పెట్టుకోవాలి..
  4. పాన్ పెట్టి 4స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక 1స్పూన్ వెల్లులి ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,ఎండుమిర్చి,1/4స్పూన్ మినపప్పు,1/4స్పూన్ ఆవాలు,1/4స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి..
  5. అన్ని వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న ఆకు వేసి వేయించాలి..ఈ ఆకు వేగేటపుడు ఆకు నుండి నీరు వస్తుంది ఆ నీరు అంత పోయేవరకు వేయించాలి..
  6. ఇప్పుడు కోసిన టమాటో ముక్కలు కొద్దిగా చింతపండు వేసి మగ్గనిచ్చి ఉడికించిన పప్పు,పసుపు ఉప్పు వేసి దగ్గరపడనివ్వాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర